బస్కీలు కొట్టు.. టికెట్ పట్టు. .

రైలులో బంధువులను లేదా కుటుంబ సభ్యులను ఎక్కించడానికి వెళ్తున్నప్పుడు..  ప్రయాణం చేయని వారు ప్లాట్ ఫారమ్ టికెట్ కొనడం తప్పనిసరి.  గతంలో మూడు, నాలుగు, ఐదు రూపాయలు ఉన్న ప్లాట్ ఫారమ్ టికెట్ ఇప్పుడు 10  రూపాయలకు చేరుకుంది.

Last Updated : Feb 22, 2020, 11:07 AM IST
బస్కీలు కొట్టు.. టికెట్ పట్టు. .

రైలులో బంధువులను లేదా కుటుంబ సభ్యులను ఎక్కించడానికి వెళ్తున్నప్పుడు..  ప్రయాణం చేయని వారు ప్లాట్ ఫారమ్ టికెట్ కొనడం తప్పనిసరి.  గతంలో మూడు, నాలుగు, ఐదు రూపాయలు ఉన్న ప్లాట్ ఫారమ్ టికెట్ ఇప్పుడు 10  రూపాయలకు చేరుకుంది. ఐతే ప్రయాణం చేయనప్పటికీ . .  ప్లాట్ ఫారమ్ టికెట్ రూపంలో జేబుకు కనీసం 10 రూపాయలైనా చిల్లు పడుతోంది. ప్లాట్ ఫారమ్ టికెట్ ధరలు పెంచినప్పుడు .. సోషల్ మీడియాలో ధరలపై చిలువలు పలువలుగా జోక్స్ కూడా వెల్లువెత్తాయి. ప్యాసింజర్ ట్రెయిన్ లో లేదా ఎంఎంఎస్ ట్రెయిన్ టికెట్ ధర కంటే ప్లాట్ ఫారమ్ టికెట్ ధరే ఎక్కువని నెటిజనులు రైల్వే శాఖపై ట్రోల్స్ తో  జోరు పెంచారు.

ఇప్పుడు అదే రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక నుంచి రైల్వే ప్లాట్ ఫారమ్ టికెట్లు ఉచితంగా లభిస్తాయని తెలిపింది. అవును.. మీరు చదివింది నిజమే. ఐతే ఇలాంటి బంపర్ ఆఫర్లకు సాధారణంగా కండిషన్స్ అప్లై అని ఉంటుంది. దీనికి అలాంటి కండిషన్స్ ఉన్నాయి. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యభారత్ ను సాధించడమే దీని ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ఫిట్ ఇండియా ఉద్యమాన్ని రైల్వే ప్లాట్ ఫారమ్ ఉచిత టికెట్లకు లింక్ పెట్టారు.

రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ టికెట్లు ఇచ్చే వెండింగ్ మిషన్ ఉంటుంది. దాని స్క్వాట్ మెషీన్ గా పిలుస్తారు. ఆ మెషీన్ ముందు నిలబడి 10 బస్కీలు తీస్తే చాలు. అది ప్లాట్ ఫారమ్ టికెట్ ఇస్తుంది. ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశామని... రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ మిషన్ ను ఢిల్లీలోని ఆనంద్ విహార్ లో ఏర్పాటు చేశారు.

కొత్తగా ఏర్పాటు చేసిన స్క్వాట్ మిషన్ పై ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసి ఉచితంగా ప్లాట్ ఫారమ్ టికెట్లు ఇవ్వడం బాగుందని రెజ్లర్ గీతా ఫోగట్ కితాబిచ్చారు.

Read Also: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఏడేళ్లలో ఇదే గరిష్టం!

 

Trending News