Tatkal tickets : తత్కాల్ టికెట్స్ త్వరగా బుక్ చేసుకునేందుకు టిప్స్

రైలులో దూర ప్రయాణం చేయాలంటే బెర్త్ కన్ఫర్మ్ అయిన టికెట్ తప్పనిసరి. లేదంటే ప్రయాణంలో చుక్కలు కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు అత్యవసర ప్రయాణాలు పడినప్పుడు ఏదేమైనా వెళ్లకతప్పని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడే అందరికీ గుర్తొచ్చేది ఐఆర్‌సిటీసి ( IRCTC )లోని తత్కాల్ టికెట్ బుకింగ్ (Tatkal ticket booking).

Last Updated : Mar 9, 2020, 04:50 PM IST
Tatkal tickets : తత్కాల్ టికెట్స్ త్వరగా బుక్ చేసుకునేందుకు టిప్స్

రైలులో దూర ప్రయాణం చేయాలంటే బెర్త్ కన్ఫర్మ్ అయిన టికెట్ తప్పనిసరి. లేదంటే ప్రయాణంలో చుక్కలు కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు అత్యవసర ప్రయాణాలు పడినప్పుడు ఏదేమైనా వెళ్లకతప్పని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడే అందరికీ గుర్తొచ్చేది ఐఆర్‌సిటీసి ( IRCTC ) లోని తత్కాల్ టికెట్ బుకింగ్ (Tatkal ticket booking). కానీ తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం కూడా అంత ఈజీ పని కాదనే విషయం కూడా అందరికీ తెలిసిందే. తత్కాల్ కోటాలో (Tatkal quota) తక్కువ సీట్లు ఉండటం... వాటి కోసం పోటీపడే వారి సంఖ్య అధికంగా ఉండటం వంటివి తత్కాల్ టికెట్ బుకింగ్‌ని క్లిష్టతరం చేసే అంశాలు. ఏ కారణం వల్లైనా చివరి నిమిషంలో తత్కాల్ టికెట్ బుకింగ్ క్యాన్సిల్ అవడం లేదా.. టికెట్ బుక్ అవకపోవడం వంటివి సర్వసాధారణంగా జరిగేవే. అలా ఒకవేళ తత్కాల్ టికెట్ బుక్ అవలేదంటే.. ఇక ప్రయాణంలో తిప్పలు తప్పవు. అందుకే చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే.. తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొన్ని మెళకువలు తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి. 

బుకింగ్ ప్రారంభానికి ముందే లాగిన్ అవ్వండి.. 
ఇండియన్ రైల్వే ( Indian Railways )లో తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఎక్కడెక్కడి నుంచో నెటిజెన్స్ ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉండి కౌంటర్ ఓపెన్ అవడం కోసం వేచిచూస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో టికెట్ బుకింగ్ ప్రారంభమైన తర్వాత లాగిన్ అయినట్టయితే, మీరు ఎంతో విలువైన సమయాన్ని కోల్పోతారు. అలా కాకుండా బుకింగ్ ప్రారంభించడానికి కొన్ని నిమిషాల ముందే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి. అయితే, అంతకంటే ముందుగానే మీరు మరో డివైజ్‌పై లాగిన్ అయి ఉన్నట్టయితే.. ఆ డివైజ్‌లోంచి లాగౌట్ అవండి. ఒకేసారి రెండు డివైజ్‌లలో లాగిన్ అయి ఉండటం వల్ల ఒక్కోసారి చివరి నిమిషంలో మళ్లీ లాగిన్ అడిగే అవకాశాలున్నాయి. అందుకే ఒక్క పరికరంలో మాత్రమే లాగిన్ అయ్యామా లేదా అనే విషయాన్ని ముందుగానే నిర్ధారించుకోండి. ఆ తర్వాతే ఒక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవండి.

మాస్టర్ లిస్ట్ రూపొందించుకోండి ( Master list )..
సీట్లను ఎంపిక చేసుకున్న తర్వాత వివరాలను నమోదు చేయకూడదు. ఎందుకంటే.. మీ కంటే ముందుగానే మరొకరు టికెట్ బుక్ చేసుకునే అవకాశాలున్నాయి. దానికి బదులుగా, ఒక వర్డ్‌ప్యాడ్ లేదా నోట్‌పాడ్‌లో మీ పేరు, వయస్సు, ఇతర వివరాలను రాసిపెట్టుకోండి. అలా చేసినట్టయితే, ఆ వివరాలను IRCTC వెబ్‌సైట్‌లోకి ఈజీగా కాపీ-పేస్ట్ చేయొచ్చు. అందుకోసం ఐఆర్‌సిటిసి ఖాతాలో పేరు, వయస్సు, ఐడి కార్డ్, బెర్త్ ప్రాధాన్యత వంటి వివరాలను పొందుపరుస్తూ ఒక మాస్టర్ జాబితాను కూడా రూపొందించవచ్చు. ఐఆర్‌సిటిసి టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఆటోఫిల్ విధానం ద్వారా ఆ వివరాలను త్వరగా నమోదు చేయడానికి వీలుంటుంది.

పేమెంట్ ఆప్షన్స్ (Payment options )..
టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకునే మరో పని డబ్బుల చెల్లింపు. ప్రయాణికుల వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత కూడా పేమెంట్ చేయడం ఆలస్యమైతే.. టికెట్ లభించడం కష్టమే. కార్డ్ వివరాలను నమోదు చేసి, ఆ తర్వాత OTP కోసం వేచిచూసే క్రమంలో చాలా సమయం తీసుకున్నట్టయితే.. టికెట్ బుకింగ్ ఛాన్సెస్ తగ్గినట్టే. అందుకే టికెట్ బుకింగ్ ప్రారంభించడానికి ముందుగానే మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలను మీ ఖాతాలో సేవ్ చేసుకుంటే మంచిది. లేదంటే మీ డిజిటల్ వ్యాలెట్‌లోనూ అవసరమైన మోతాదులో డబ్బు లోడ్ చేసుకోవచ్చు. అలా చేసినట్టయితే.. టికెట్ బుకింగ్ సమయంలో మళ్లీ మనీ లోడ్ చేయడం కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు.

స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ( Internet speed)..
లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. టికెట్ బుకింగ్ కోసం ఉపయోగిస్తున్న పరికరానికి స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఎంతో అవసరం. ఇంటర్నెట్ కనెక్షన్ వేగంగా లేకపోతే.. పేజీ లోడ్ అవడం నుంచి మొదలుపెడితే.. ప్రయాణికుల వివరాలు నమోదు చేయడం, సీట్ల ఎంపిక, పేమెంట్ చేయడం వంటివన్నీ ఆలస్యమవుతాయి. ఫలితంగా అదే మిడిల్ గ్యాప్‌లో మీకు బుక్ అవ్వాల్సి ఉన్న టికెట్‌ని మరొకరు తన్నుకునిపోతారు. అందుకే ఇంటర్నెట్ స్పీడ్‌గా ఉండేలా చూసుకోండి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News