సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీలంకలో పాలకులపై ప్రజాగ్రహం పెల్లుబికుతూనే ఉంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండానే దేశం వీడి పారిపోయిన గొటబాయ రాజపక్సపై లంక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజపక్స రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగుతున్నారు.
Srilanka Crisis: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోయారని తెలియడంలో వేలాది మంది ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ఆందోళనకు దిగారు. పశ్చిమ శ్రీలంకలో పరిస్థితులు చేయి దాటిపోయాయి. దీంతో ఎమర్జెన్సీ విధించారు అధికారులు.
Sri Lanka Crisis: Sri Lanka President Gotabaya Rajapaksa left country, Sajith Premadasa in Race. శ్రీలంకలో ఇప్పటికే ప్రధాని పదవి నుంచి రణిల్ విక్రమసింఘే తప్పుకోగా.. అధ్యక్షుడు గొటబయ రాజపక్స సైతం దేశం విడిచి పారిపోయారు.
Srilanka Crisis:శ్రీలంక మళ్లీ రణరంగమైంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో నెల క్రితం వరకు తీవ్ర ఆందోళనలు జరిగాయి. నిరసనలు హోరెత్తడంతో ప్రధానమంత్రి పదవికి మహేంద్ర రాజపక్స రాజీనామా చేశారు. ఆయన స్థానంలో విక్రమ్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నిరసనలు తగ్గాయి. అయితే తాజాగా మళ్లీ శ్రీలంకలో నిరసనలు హోరెత్తాయి.
తినడానికి తిండిలేక.. రోగం వస్తే మందుల్లేక.. కాగితాలు లేక పరీక్షలు వాయిదా, డీజిల్ లేక బండ్లు నిలిచిపోయాయి.. నిరవధిక కరెంట్ కోతలు.. చాలా దయ నీయంగా మారింది లంకేయుల పరిస్థితి. అల్లకల్లోలంగా మారిన శ్రీలంకకు పెద్దన్నలా భారత్ అండగా నిలబడింది. నిత్యావసర వస్తువులైన ఇంధనం, బియ్యాన్ని లంకు భారత్ పంపింది.
Curfew in Srilanka: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 36 గంటల పాటు కర్ఫ్యూ విధిస్తూ అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.