Srilanka Crisis: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం... దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ..

Curfew in Srilanka: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 36 గంటల పాటు కర్ఫ్యూ విధిస్తూ అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2022, 07:05 PM IST
  • దివాళా తీసిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ
  • అత్యంత దుర్భర పరిస్థితుల్లో లంక
  • దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు
  • దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ విధింపు
Srilanka Crisis: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం... దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ..

Curfew in Srilanka: ఆర్థిక వ్యవస్థ దివాళా తీయడంతో అత్యంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న శ్రీలంకలో 36 గంటల దేశవ్యాప్త కర్ఫ్యూ విధిస్తూ అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. శనివారం (ఏప్రిల్ 2) సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు (ఏప్రిల్ 4) వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఓవైపు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా.. ప్రభుత్వం కర్ఫ్యూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ శ్రీలంకలో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గురువారం (మార్చి 31) వేలాది మంది జనం కొలంబోలోని అధ్యక్షుడి నివాసాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటిరోజే రాజపక్స ఎమర్జెన్సీ విధించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా రక్షణ, అత్యవసర సరుకుల సరఫరా, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయించినట్లు రాజపక్సే వెల్లడించారు. తక్షణమే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమలులోకి వస్తుందని తెలిపారు. 

ఎమర్జెన్సీ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమర్జెన్సీ అయితే విధించారు గానీ.. దానికి సంబంధించిన నిబంధనలేవీ ఇంకా విడుదల చేయలేదని భవాణి ఫొన్సెకా అనే ఓ రీసెర్చర్ పేర్కొన్నారు. ఇంతలోనే దేశంలో కర్ఫ్యూ విధించడం గమనార్హం. శ్రీలంక ప్రభుత్వ తీరుపై అక్కడి ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నిత్యావసరాలు తీర్చలేని ప్రభుత్వం... కనీసం నిరసన తెలిపే స్వేచ్చ కూడా లేకుండా చేయడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Revanth Reddy: తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణశాసనం, ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి

Beast Movie Trailer: విజయ్ దళపతి 'బీస్ట్' మూవీ ట్రైలర్ వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News