రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana cm kcr ) అప్రమత్తమయ్యారు. ఎక్కడా ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బంగాళాఖాతంలో ( Bay of Bengal ) నెలకొన్న అల్పపీడన ( Depression ) ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కరుస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదులు వరద ప్రవాహంతో ఉరకలెత్తుతున్నాయి. ముఖ్యంగా గోదావరి వరద ( Godavari floods ) ఉధృతితో పోటెత్తుతోంది. మరో మూడు నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాల ( Heavy rains ) హెచ్చరిక నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి ( cm kcr review ) సమావేశం నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్థినష్టం లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికార్లను ఆదేశించారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఒక్కరి ప్రాణం కూడా పోకుండా యంత్రాంగం పనిచేయాలన్నారు. సహాయక చర్యల కోసం ఖర్చుపెట్టడానికి వెనకాడవద్దని సూచించారు.
ముఖ్యంగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం తదితర జిల్లాల్లో వర్షాలతో పాటు వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో అన్ని శాఖలు సంయుక్తంగా కలిసి పనిచేయాలని సూచించారు. భద్రాచలంలో వరద ఉధృతి మరింత పెరగనుందన్న హెచ్చరికల నేపధ్యంలో తక్షణ చర్యలు తీసుకోవల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు. Also read: Telangana: 20 అంబులెన్స్‌లు అందించిన జీ సంస్థ
Telangana: గోదావరి వరద, భారీ వర్షాలపై కేసీఆర్ సమీక్ష