GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ అందర్నీ విస్మయపరుస్తోంది. ఓటింగ్ శాతం తగ్గడంపై బీజేపీ అధికారపార్టీపై విమర్శలు తీవ్రం చేసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పై విమర్శలు సంధించారు.
GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ సరళి చూస్తుంటే..50 శాతం దాటే అవకాశాలు కన్పించడం లేదు. మరోవైపు పోలింగ్ సందర్బంగా అక్కడక్కడా చిన్న చిన్న ఘటనలు చోటుచేసుకున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling ) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 8.90 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ పద్థతిలో జరుగుతున్న పోలింగ్..ఉదయం 7 గంటలకు మొదలైంది. పోలింగ్ ప్రారంభంలోనే ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, మంచు లక్ష్మి, తనికెళ్లతో పాటు..రాజకీయ ప్రముఖులైన కేటీఆర్, కిషన్ రెడ్డి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling begins ) ప్రారంభమైంది. భారీ భద్రత మధ్య జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లల్లో మంగళవారం ఉదయం 7గంటలకు కోవిడ్ (Covid-19) నిబంధనలతో ప్రారంభమైంది.
GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసి..ధన ప్రవాహం ప్రారంభమైంది. ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు నగదు పంపిణీ మొదలెట్టారు. ఈసీకు దొరకకుండా ఉండేందుకు గూగుల్ పే, ఫోన్ పే విధానాన్ని ఎంచుకున్నారు.
GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నిలకు ఎన్నికల కమీషన్ సర్వం సిద్ధం చేసింది. పోలింగ్‌కు మరి కొద్ది గంటల సమయం మిగిలింది. ఉదయం 7 గంటల్నించి..సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. గ్రేటర్ పరిధిలో ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు, అభ్యర్ధుల వివరాలివే..
GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం ముగిసింది. విమర్శలు ప్రతి విమర్శలు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు..మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల (GHMC Elections 2020) ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముందుగా హోంమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
నేడు చివరిరోజు నేతలు తమ వ్యూహాలను ప్రచారం చేసి జనాల్లోకి తీసుకెళ్లేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార పోరు నేటి సాయంత్రం ముగియనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుండటంతో మద్యం (Wine Shops Closed in Hyderabad) విక్రయాలను నిలిపివేయనున్నారు.
జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో జనసేన తీసుకున్న నిర్ణయంపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో మరింత వేడిని రాజేశాయి. తాజాగా నాగబాబు చేసిన కామెంట్లపై ప్రకాష్ రాజ్ మళ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. రేపటితో ప్రచారం ముగియనుంది. ఆఖరి రోజు బీజేపీ అగ్రనేత అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో నగరంలో భారీ భద్రత ఏర్పాటవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు (GHMC Elections 2020) డిసెంబరు 1న జరగనున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు (GHMC Elections 2020) సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi)పై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీ, అనుభవంపై తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు (Prakash Raj sensational Comments on Pawan Kalyan) చేశారు. జనసేన అధినేత పూటకు ఓ మాట మారుస్తున్నారని, ఆయన ఓ ఊసరవెల్లి అని ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు.
హైదరాబాద్ వరదల సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు రాని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలకు జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections 2020) అనగానే ఓట్ల కోసం నగరవాసులు గుర్తుకొచ్చారా అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు (GHMC Elections 2020) సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి.
తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ (Hyderabad) నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో (Telangana) మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని.. అలాంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ (Swamy Goud) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda ) సమక్షంలో స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు.
ఎన్నికల సమయంలో బాధితులకు సహాయం చేయకూడదా..ఇదే ఇప్పుడు హైాకోర్టులో చర్చనీయాంశమైన ప్రశ్న. డిసెంబర్ 4 తరువాతే వరద సహాయం అందించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.