GHMC Elections 2020: రేపు బీజేపీ అగ్రనేత అమిత్ షా రోడ్ షో

GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. రేపటితో ప్రచారం ముగియనుంది. ఆఖరి రోజు బీజేపీ అగ్రనేత అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో నగరంలో భారీ భద్రత ఏర్పాటవుతోంది.

Last Updated : Nov 28, 2020, 09:44 PM IST
  • ఆఖరి రోజు కావడంతో గ్రేటర్ బరిలో హోరెక్కనున్న ప్రచారం
  • రేపు సికింద్రాాబాద్ వారాసి గూడ నుంచి సీతాఫల్ మండి వరకూ కేంద్రమంత్రి అమిత్ షా రోడ్ షో
  • ఉదయం పది గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమిత్ షా పూజలు
GHMC Elections 2020: రేపు బీజేపీ అగ్రనేత అమిత్ షా రోడ్ షో

GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. రేపటితో ప్రచారం ముగియనుంది. ఆఖరి రోజు బీజేపీ అగ్రనేత అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో నగరంలో భారీ భద్రత ఏర్పాటవుతోంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ( GHMC Elections ) ప్రచారం తుది అంకానికి చేరుకుంది. అధికారపార్టీ టీఆర్ఎస్ ( TRS ) , బీజేపీ ( BJP ) మధ్య ఆరోపణాస్త్రాలతో వాతావరణం పూర్తిగా వేడెక్కింది. బీజేపీ తరపున ఇప్పటికే యోగీ ఆదిత్యనాధ్ ( Yogi Adityanath ), స్మృతి ఇరానీ ( Smriti irani ) తదితరులు ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ ఆఖరి అస్త్రాన్ని రేపు ప్రయోగించనుంది. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Central minister Amit shah ) హైదరాబాద్ చేరుకోనున్నారు. 

రేపు ఉదయం పది గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని..అక్కడ్నించి నేరుగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. తరువాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి హనుమాన్ టెంపుల్ వరకూ అమిత్ షా రోడ్ షో ( Amit shah road show ) నిర్వహించనున్నారు. మద్యాహ్నం 1 గంట 30 నిమిషాల్నించి సాయంత్రం 4 గంటల వరకూ బీజేపీ కార్యాలయంలో గడిపి.. 5 గంటలకు ఢిల్లీకు బయలుదేరుతారు.

మరోవైపు కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన పురస్కరించుకుని పాతబస్తీకు భారీగా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చెలరేగిన నేపధ్యంలో..సాయంత్రం నుంచే భద్రతను కట్టుదిట్టం చేశారు. హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపధ్యంలో మరింత భద్రతను పెంచారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా రంగంలో దింపారు. Also read: GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల కోసం కొత్త యాప్

Trending News