గ్రేటర్ ఎన్నికల వేళ కొత్త వివాదం రేగుతోంది. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై దుమారం ప్రారంభమైంది. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ విషయమై తప్పటడుగులు వేసిన జనసేన..ఇకపై కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. తిరుపతి సీటును కోరుతూ బీజేపీ ముందు ప్రతిపాదన ఉంచనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ (TRS) ఒక్కటే 150 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది.
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ టీఆర్ఎస్ మేనిఫెస్ట్ విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అందులో చాలా మంది దృష్టిని ఆకర్షించిన ప్రధానమైన అంశం ఏంటంటే..
తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుంటామని..దీనికి కావల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కోవిడ్ కారణంగా నష్టపోయిన పరిశ్రమకు రాయితీలు కల్పించనున్నామని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరుకు సంబంధించి కీలకమైన ఘట్టమంతా ముగిసింది. అటు నామినేషన్ల స్క్రూటినీ ఇటు ఉపసంహరణ రెండూ ముగిశాయి. గ్రేటర్ బరిలో 68 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టత ఇచ్చారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు లేదని ఒవైసీ స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు ఊపందుకుంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ ఛార్జిషీటు విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ఛార్జిషీటు విడుదల చేశారు.
హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అంతకంటే ముందుగా కరోనా పరీక్షలు చేయించుకుని.. నెగటివ్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ప్రచారంలో పాల్గొనేలా చూడాలంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ శనివారం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా గడిపారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలానగర్లో జరిగిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. నగరంలో ఆరేండ్ల కిందకు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ఓటర్లకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్: హైదరాబాద్ వరద బాధితులకు అందించే వరద సాయాన్ని నిలిపేయాల్సిందిగా తాను ఎన్నికల కమిషన్కు లేఖ రాయలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ఒక పథకం ప్రకారమే ఫేక్ లెటర్ సృష్టించి తనను, బీజేపిని బద్నాం చేసేందుకు కుట్రపన్నిందని, ఆ లేఖపై ఉన్న సంతకం కూడా తనది కాదని బండి సంజయ్ తెలిపారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపిలో చేరారు. బీజేపిలోకి వెళ్తూ వెళ్తూ.. కాంగ్రెస్ పార్టీపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో హైదరాబాద్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అభ్యర్థుల జాబితాను ప్రకటించి వారి చేత నామినేషన్స్ దాఖలు చేయించిన ఆయా రాజకీయ పార్టీల పెద్దలు.. తాజాగా ప్రచారంపై దృష్టిసారించారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్టు ప్రకటించిన టీడీపీ.. తాజాగా తెలుగు దేశం పార్టీ అభ్యర్ధులకు సంబంధించిన తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర విభజనకు ముందుగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో బలమైన నాయకులను కలిగి ఉన్న టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత పార్టీకి చెందిన కీలక నేతలు వేరే పార్టీల్లో చేరడంతో బలహీనపడిందనే విషయం ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో రుజువవుతూ వచ్చింది.
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. మొదటిసారి 29 మంది అభ్యర్థులతో, ఆ తర్వాత 16 మంది అభ్యర్థుల పేర్లతో రెండుసార్లు జాబితాను విడుదల చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. గురువారం రాత్రి మూడో జాబితాను ప్రకటించారు.
వినాయకుడి మెడలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పడం వివాదం రేపింది. ఎన్నికలకు ముందు నామినేషన్ వేయడానికంటే ముందుగా నామినేషన్ పత్రాలు గుడిలో దేవుడి ముందు పెట్టి తీసుకెళ్లడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. నిన్న బుధవారం విడుదల చేసిన మొదటి జాబితాలో 21 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. నేడు విడుదల చేసిన సెకండ్ లిస్టులో 18 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. బీజేపి సెకండ్ లిస్ట్ అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. నేతలు ఆరోపణలు వేడెక్కుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలు పురస్కరించుకుని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీకే చెందిన నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో రూ. 68 వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామని తెలంగాణ సర్కార్ చెప్పుకుంటోంది కానీ.. ఆ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని ప్రభుత్వానికే సూటి ప్రశ్నలు సంధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.