Free Ration Scheme Extends: ఎన్నికల వేళ రేషన్ కార్డు హోల్డర్లకు ప్రధాని నరేంద్ర మోదీ గుడ్‌న్యూస్ చెప్పారు. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో మోదీ ప్రసంగించిన మోదీ.. ఈ మేరకు ప్రకటన చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై దాదాపు రూ.2 లక్షల కోట్ల అదనపు భారం పడనుంది.
Free Rice Scheme: చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమైన ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ కేసులు ఇండియాలోనూ నమోదైన నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం కొవిడ్ కేసులపై అప్రమత్తమైంది. కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక విధంగా ప్రభుత్వం అందించే రేషన్ పైనే ఆధారపడి బతికే బడుగు జీవులకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఊరటనిచ్చింది.
Ration Card Online: రేషన్ పంపిణీలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక మార్పులు చేశాయి. ఉచిత రేషన్ పథకం కింద గోధుమల పంపిణీ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా గోధుమల కొరత కారణంగా.. గోధుమల స్థానంలో బియ్యం పంపిణీ చేయనున్నాయి.
Free Ration Scheme: పేద ప్రజలకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్‌ను మరిన్ని రోజులు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో మరికొంత మందికి లబ్ధి చేకూరనుంది.
PM Modi On Omicron: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన మోదీ.. సాగు చట్టాల రద్దు బిల్లు, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకం గురించి మాట్లాడారు.
Free Ration Scheme: కరోనా సంక్షోభంలో ప్రవేశపెట్టిన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని (పీఎంజీకేఏవై) గడువును పొడిగిస్టున్నట్టు ప్రకటించింది. దీనికి అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీని మరో నాలుగు నెలల పాటు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
Free Ration Scheme: కరోనా సంక్షోభంలో అన్నార్థుల ఆకలి తీర్చిన గరీబ్ కల్యాణ్ అన్న యోజన ఈ నెల 30తో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పథకం గడువు పెంచే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.