Free Rice Scheme: దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డుపై ప్రభుత్వం అందించే రేషన్ సరుకులపైనే ఆధారపడి జీవనం సాగించే వారికి కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రేషన్ షాపులలో అందిస్తున్న ఉచిత ఆహార ధాన్యం పథకాన్ని 2023 డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నేషనల్ ఫుడ్ సెక్యురిటీ యాక్ట్ కింద 80 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ అన్నారు.
మరో ఏడాదిపాటు రేషన్ కార్డుదారులు ఆహార ధాన్యాల కొనుగోలు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఉచిత ఆహార ధాన్యాల పథకం కొనసాగించడం కోసం కేంద్రం ఏడాదికి 2 లక్షల కోట్లు వెచ్చిస్తున్నట్టు కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ స్పష్టంచేశారు.
కరోనావైరస్ కోరలు చాచిన తరువాత ఆకలి చావులను నివారించే లక్ష్యంతో 2020 లో జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ప్రారంభించామని.. పథకం కాల పరిమితి పూర్తి కావస్తుండటంతో మరో ఏడాది పాటు ఈ పథకం అమలయ్యేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది అని అన్నారు. ఈ పథకం కింద 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది అని పీయుష్ గోయల్ గుర్తుచేశారు.
చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమైన ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ కేసులు ఇండియాలోనూ నమోదైన నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం కొవిడ్ కేసులపై అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు కొవిడ్ కేసులపై నిఘా పెట్టాలని.. కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీచేసింది. రాబోయే రోజుల్లో కొవిడ్ కేసులు పెరగనున్నాయా ? మరోసారి రెండేళ్ల క్రితం నాటి లాక్ డౌన్ తరహా పరిస్థితులు వస్తాయా అనే అనుమానాల నేపథ్యంలోనే కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక విధంగా ప్రభుత్వం అందించే రేషన్ పైనే ఆధారపడి బతికే బడుగు జీవులకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఊరటనిచ్చింది.
ఇది కూడా చదవండి : India's COVID Cases: దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్స్
ఇది కూడా చదవండి : Jio Happy New Year 2023 Plan: రిలయన్స్ జియో కస్టమర్స్‌కి గుడ్ న్యూస్.. రోజుకు 2.5GB డేటా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook