Cv Anand mass warning on fake posts on Sandhya theatre incident: అల్లు అర్జున్ ఘటన ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో దీనిపై ఇటీవల పొలిటికల్ గా మాత్రమే కాకుండా.. ఇండస్ట్రీ పరంగా కూడా వివాదం రాజుకుందని చెప్పుకొవచ్చు. సీఎం రేవంత్ తన ఈగో కోసం ఇవన్ని చేస్తున్నాడని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం.. సినిమా చూద్దామని వచ్చి ఒక తల్లి ప్రాణాలు కోల్పోయింది.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
According to the Sandhya theatre CCTV footage,
Revathi went unconscious - 9.16pm, 4th DecAccording to the video release by Hyd police,@alluarjun entered into theatre - 9.35pm, 4th Dec
What has had happened actually ? 😳 #StopCheapPoliticsOnALLUARJUN pic.twitter.com/VnzvUVQZa6
— . (@alanatiallari_) December 24, 2024
ఇలాంటి ఘటనకు అల్లు అర్జున్ పనులే కారణమని మరికొందరు వాదిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం ఈ ఘటన కాస్త పొలిటికల్ టర్న్ కూడా తీసుకుందని చెప్పుకొవచ్చు.ఈ ఘటనలో మాత్రం.. బీఆర్ఎస్ , బీజేపీలు బన్నీకి సపోర్ట్ గా నిలుస్తున్నారని చెప్పుకొవచ్చు. అయితే.. పుష్ప2 సంధ్య థియేటర్ తొక్కిసలాట నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా, ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిలో అల్లు అర్జున్ రాకముందే.. రేవతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని.. ఆమెను సిబ్బంది బైటకు తీసుకెళ్తున్నట్లు ఉంది. అయితే.. ఈ వీడియోపై పెద్ద చర్చే నడుస్తొంది.
ఈ క్రమంలో దీనిపై హైదరబాద్ పోలీసులు సీవీ ఆనంద్ రంగంలోకి దిగి సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో లేనీ పోనీ ఫెక్ వీడియోలు, ఎడిటెడ్ వీడియోలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ధమ్కీ ఇచ్చారు. ఏవైన తమ దగ్గర నిజంగా ప్రూఫ్ లు ఉంటే.. తమకు అందించాలన్నారు.
కానీ ఉద్దేష పూర్వకంగా పోలీసుల్ని బద్నాంచేసే విధంగా ఎలాంటి పనులు చేసిన కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ మేరుకు సీపీ ఒక ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.