Pradhan Mantri Garib Kalyan Yojana: ఉచిత రేషన్ పథకం నవంబర్ 30 తర్వాత నిలిపివేత!

Free Ration Scheme: కరోనా సంక్షోభంలో అన్నార్థుల ఆకలి తీర్చిన గరీబ్ కల్యాణ్ అన్న యోజన ఈ నెల 30తో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పథకం గడువు పెంచే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 03:19 PM IST
  • గరీబ్ కల్యాణ్​ అన్న యోజన పథకానికి నవంబర్ 30 చివరి తేదీ!
  • మరోసారి గడువు పెంచే ప్రతిపాదన లేదన్న కేంద్రం
  • ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటమే కారణమని వెల్లడి
Pradhan Mantri Garib Kalyan Yojana: ఉచిత రేషన్ పథకం నవంబర్ 30 తర్వాత నిలిపివేత!

Pradhan Mantri Garib Kalyan Yojana: కరోనా కాలంలో పేదల ఆకలి తీర్చేందుకు.. కేంద్రం ప్రవేశ పెట్టిన ప్రతిష్ఠాత్మక పథకం గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన (PMGKY). కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్ వల్ల ఎవరూ ఆకలితో ఉండొద్దనే (Lockdown impact on Poor people) ఉద్దేశంతో గత ఏడాది ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది కేంద్రం. వలస కూలీలు సహా పేదలకు సబ్సిడీతో లభించే రేషన్​కు అదనంగా.. తలా అయిదు కిలోల గోధుమలు లేదా బియ్యం, కిలో పప్పు వంటివి ఉచితంగా (Free ration supply) సరఫరా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ పథకాన్ని గత ఏడాది ప్రవేశ పెట్టగా.. పలు మార్లు దీని గడువును పెంచింది కేంద్రం. చివరిసారిగా పెంచిన గడువు.. ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే పథకం గడువు మరోసారి పెరిగే అవకాశాలు (Last date to PMGKY) లేవని తెలుస్తోది.

ఈ నెల 30 తర్వాత ఉచిత రేషన్ గడువు పెంచే ప్రతిపాదన తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ దాదాపుగా కోలుకున్న నేపథ్యంలో అన్న యోజన కింద ఉచిత రేషన్ గడువు పెంచే ప్రతిపాదన చేయలేదని ఆహార, ప్రజాపంపిణీ విభాగం (Govt On PMGKY) పేర్కొంది.

Also read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్ కేసు విచారణ నుంచి వాంఖడేను తొలగించిన ఎన్సీబీ

Also read: Tragedy on Diwali: స్కూటీలో టపాసులు తీసుకెళ్తుండగా భారీ పేలుడు.. తండ్రి, కొడుకు మృతి

పథకం వివరాలు..

గత ఏడాది కరోనా ఆరంభ దశలో విధించి లాక్​డౌన్ కారణంగా గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనకు శ్రీకారం చుట్టింది కేంద్రం. ఈ పథకం వ్యయాన్ని (PMGKY Budget) రూ.60 వేల కోట్లుగా అంచనా వేసింది. 

తొలుత గత ఏడాది ఏప్రిల్‌ నుంచి మూడు నెలలపాటు వర్తించేలా రూ.60 వేలకోట్లతో గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనకు శ్రీకారం చుట్టింది కేంద్రం. అ తర్వాత కూడా కరోనా సంక్షోభం కారణంగా గడువు పెంచుతూ వచ్చింది. అలా చివరి సారిగా ఈ ఏడాది జూన్​లో ఈ పథకం గడువును.. నవంబర్ 30గా నిర్ణయించింది. గడువుల పెంపు వల్ల గత ఏడాది జులైలోని రూ.90 వేల కోట్ల అదనపు భారం కేంద్రంపై పడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జూన్​తో ఆ గడువు భారం మరింత పెరుగుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పథకం వల్ల 80 కోట్ల మంది వరకు లబ్ధిపొందినట్లు అధికారిక వర్గాల సమాచారం.

Also read: Edible Oil Price Reduced: దేశంలో భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. లీటరుకు రూ.5 నుంచి రూ.20 తగ్గింపు

Also read: Mukesh Ambani: ముకేశ్ అంబానీ ఫ్యామిలీ లండన్‌కు మకాం మారుస్తున్నారా.. ఆ ప్రాపర్టీ అందుకే కొనుగోలు చేశారా?

గడుపు పెంచకపోవడానికి కారణం అదేనా?

అయితే దేశంలో వ్యాక్సినేషన్ జోరుగా (COVID vaccination in India) సాగుతుంటడం, కరోనా కేసులు తక్కువగా నమోదవుతుండటం సహా.. ఆర్థిక వ్యవస్థ దాదాపుగా తేరుకున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ కారణాలన్నింటితో అన్న యోజన పథకం గడువు పెంచేందుకు కేంద్రం సుముఖంగా లేదని సమాచారం.

Also read: Former MP assaulted: తాగిన మత్తులో గుర్తు తెలియని ఇంటికెళ్లిన మాజీ ఎంపీ- చితక బాదిన ఓనర్​!

Also read: Maharastra: ఐసీయూలో అగ్నిప్రమాదం...ఆరుగురు కరోనా రోగులు మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News