Free Ration Scheme: పేదలకు గుడ్‌న్యూస్..ఉచిత రేషన్ పంపిణీ ఎప్పటి వరకంటే..!

Free Ration Scheme: పేద ప్రజలకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్‌ను మరిన్ని రోజులు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో మరికొంత మందికి లబ్ధి చేకూరనుంది.

Written by - Alla Swamy | Last Updated : Sep 28, 2022, 04:09 PM IST
  • కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం
  • పేద ప్రజలకు శుభవార్త
  • ఉచిత రేషన్‌ పొడిగింపు
Free Ration Scheme: పేదలకు గుడ్‌న్యూస్..ఉచిత రేషన్ పంపిణీ ఎప్పటి వరకంటే..!

Free Ration Scheme: కరోనా మహమ్మారితో దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్‌ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత రెండేళ్ల నుంచి పేద ప్రజలకు ఉచిత రేషన్‌ను అందిస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్ పథకాన్ని మరికొన్నిరోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మరో మూడు నెలలపాటు ఈపథకం అమలుకానుంది.

ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. వచ్చేనెలలో దసరా, దీపావళి పండగులు ఉన్నాయి. దీంతో ఉచిత రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని పొడిగించినట్లు తెలుస్తోంది. ఈపథకం వల్ల ప్రభుత్వంపై రూ.45 వేల కోట్ల భారం పడనుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక భారాన్ని కొంతమేర తగ్గించేందుకు రేషన్‌ కింద అందించే ఆహార పదార్థాల పరిమాణాన్ని తగ్గించే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం అమలు అవుతున్న ఉచిత రేషన్‌ పంపిణీ పథకం ఈనెల 30తో ముగియనుంది. మరో మూడు నెలలు పొడిగిస్తే..ఈఏడాది చివరకు వరకు ఈకార్యక్రమం అమలు కానుంది. 2020లో కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో అనేక మంది ఉపాధి కోల్పోయి..రోడ్డుపై పడ్డారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 2020 ఏప్రిల్‌ నుంచి ఉచిత రేషన్‌ను అందిస్తున్నారు.

ఆ తర్వాత కరోనా సెకండ్, థర్డ్ వేవ్ రావడంతో విడతల వారిగా పథకాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. ఇటీవల ఉచిత రేషన్‌ను పొడిగించారు. ఆ గడువు ఈనెల 30తో ముగియనుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలు లబ్ధి పొందనున్నారు. వారికి నెలకు 5 కేజీల చొప్పున ఉచిత రేషన్‌ను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈపథకం కోసం కేంద్రప్రభుత్వం రూ.3.4 లక్షల కోట్లను ఖర్చు చేసింది. మరో మూడు నెలలు పొడిగించడంతో..మరింత భారం పడనుంది.

తమది పేదల ప్రభుత్వమని ప్రధాని మోదీ చెబుతూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే వారి కోసం ప్రత్యేక పథకాలను తీసుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సరికొత్త పథకాలను అమలు చేయనున్నట్లుఉ తెలుస్తోంది. 

Also read:CM Kcr: సింగరేణి కార్మికులకు శుభవార్త..దసరా కానుక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశం..!

Also read:Union Govt: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..డీఏ ఎంత పెరిగిందో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News