పరకాలలో బహిరంగసభలో సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటన చేయాలని బీజీపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆ వివరాలు..
MLA Etela Rajender Slams CM KCR: అటుకులు బుక్కిన బీఆర్ఎస్ పార్టీ.. రూ.900 కోట్ల వైట్ మనీ ఉన్న పార్టీగా ఎలా మారిందో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ పైసలతో రాజకీయం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. యుద్ధం వీరుడిగా మాదిరి చేయాలని హితవు పలికారు.
Etela Rajender Press Meet: పెద్ద కులం అయితేనే ఎన్నికల్లో గెలుస్తామని అనుకోవడం తప్పని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మన డిక్షనరీలో సాధ్యం కానిది ఏమీ లేదని ఉండాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు.
Etela Rajender Slams CM KCR: బీజేపీ ప్రభావం తగ్గిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. తమ సత్తా ఏంటో తెలుస్తందని ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ను బొందపెట్టాలని తెలంగాణ ప్రజలు చూస్తున్నారని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనన్నారు.
Etela Rajender Press Meet Today: దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని, తెలంగాణలో సంపదకు కొదువలేదని, అన్నింట్లో నెంబర్ 1 అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు. ఆఖరికి పరిస్థితి ఎలా తయారైందంటే.. భూములను అమ్మితే కానీ రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారింది అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Etela Rajender Fires on CM KCR: సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. గిరిజన, దళిత మహిళలకు కేసీఆర్ ప్రభుత్వంలో రక్షణ లేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఇంకో మూడు నెలలు మాత్రమే ఉంటుందని.. దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ అన్నట్లు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Etela Rajender Counter To Minister KTR: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే సినిమా చూపిస్తారని అన్నారు. సినిమా చూపించేది నాయకులు కాదని.. ప్రజలేనని అన్నారు.
Etela Rajender Comments On CM KCR: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రైతుల భూములు లాక్కుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రైతుల మీద జలగల్లాగా బతకవద్దన్నారు.
KTR comments on PM narendra modi speech in warangal meeting: ప్రధానమంత్రి మోడీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలుకొని తన ప్రసంగం మొత్తం అసత్యాలతో కొనసాగిందన్నారు.
PM Modi's Warangal Meeting: వరంగల్ గడ్డమీద 30 సంవత్సరాల తరువాత దేశప్రధాని అడుగు పెట్టబోతున్నారు అని బీజేపి నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీని అక్కున చేర్చుకొని అండగా నిలిచిన జిల్లా అని చెబుతూ.. దేశంలో ఇద్దరే ఎంపీలు ఉన్న రోజుల్లోనే హన్మకొండ నుండి ఎంపీని ఎన్నుకున్నారని వరంగల్ ప్రజానికానికి ఈటల రాజేందర్ గుర్తుచేశారు.
Etela Rajender is BJP's CM candidate: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఉన్నట్టుండి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. తెలంగాణ బీజేపిలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. బీజేపి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది జీ న్యూస్ తెలుగు ఎడిటర్ భరత్ విశ్లేషిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Ponguleti Srinivas Reddy Meeting with BJP Leaders: బీజేపీలో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా చూడటమే తమ ఎజెండా అని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని స్పష్టంచేశారు.
KTR Satires On Amit Shah's Speech: అమిత్ షా వ్యాఖ్యలపై ట్విటర్ ద్వారా స్పందించిన మంత్రి కేటీఆర్.. అమిత్ షా ప్రస్తావించిన అంశాలనే గుర్తుచేస్తూ ఆ అంశాలకు విరుద్ధ వ్యాఖ్యలతో సెటైర్లు వేశారు. డీయర్ అమిత్ షా జీ అంటూ మొదలుపెట్టిన కేటీఆర్.. " బీజేపి త్వరలో అధికారంలోకి కాదు.. అంధకారంలోకే వెళ్తుంది" అని అన్నారు.
Etela Rajender Vs Revanth Reddy: కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏడ్వటంలో తప్పులేదని.. నిజంగా బాధ ఉంటేనే ఏడుపు వస్తుందన్నారు.
Revanth Reddy To Etela Rajender: “రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు.. ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను సీఎం కేసీఆర్‌తో పోరాటం చేస్తా.. అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా... మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే... నా కుటుంబం సర్వ నాశనమైపోతుంది” అని చెబుతూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.