Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్

MLA Etela Rajender Slams CM KCR: అటుకులు బుక్కిన బీఆర్ఎస్ పార్టీ.. రూ.900 కోట్ల వైట్ మనీ ఉన్న పార్టీగా ఎలా మారిందో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ పైసలతో రాజకీయం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. యుద్ధం వీరుడిగా మాదిరి చేయాలని హితవు పలికారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 12, 2023, 10:33 PM IST
Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్

MLA Etela Rajender Slams CM KCR: బీఆర్ఎస్-బీజేపీ కలిసిపోయాయనే ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నాయకులకు పిలుపునిచ్చారు. ఘట్కేసర్ అవుషాపూర్‌లోని పీపీఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన బీజేవైఎం మండల అధ్యక్షుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. బీజేపీ భవిష్యత్ మీ చేతుల్లో ఉందని వారికి చెప్పారు ఈటల. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు సమాధానం చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్ ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబం తప్ప వేరే వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. 

"కానీ ఒక చాయ్ వాలాను దేశ ప్రధాని చేసింది బీజేపీ. ఒక దళితుడునీ.. ఇప్పుడు ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేసింది బీజేపీ. ఇది బీఆర్ఎస్ ఉన్నంత వరకు సాధ్యం కాదు. డబుల్ బెడ్ రూం కోసం కేంద్రం నిధులు ఇస్తున్నా కూడా పేదలకు సరిపోయేన్ని ఇళ్లు కట్టి ఇవ్వడం లేదు. ధరణి తీసుకొచ్చి కబ్జా కాలం తీసివేసి దళితుల భూములు లాక్కున్న దుర్మార్గపు ప్రభుత్వం ఇది. ఇన్ని చేసి భుకాయిస్తున్న వ్యక్తి కేసీఆర్. పెన్షన్లు నేనే ఆపిన అని కేసీఆర్‌నే అసెంబ్లీ వేదికగా చెప్పారు. 

నేను ప్రశ్నిస్తే ఇస్తా అని ఇచ్చి ఇప్పటికే ఇవ్వలేదు. అటుకులు బుక్కిన పార్టీ.. 900 కోట్ల వైట్ మనీ ఉన్న పార్టీగా ఎలా మారిందో.. కేసీఆర్ ఎలా ఎదిగాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. పైసలతో కేసీఆర్ రాజకీయం నడుపుతున్నారు. ఇంతకు ముందు తెలంగాణలో ఇలాంటి పరిస్థితి లేదు. ఓటుకు డబ్బులు ఇవ్వాలని ధర్నా చేసే దుస్థితికి ప్రజలను కేసీఆర్ తీసుకువచ్చారు. కేసీఆర్ యుద్దం వీరుని లెక్క చెయ్యి. ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. తప్ప లొంగేది లేదు. కొట్లాడేందుకు సిద్దంగా ఉన్నా. వీరుడు ఎప్పుడు ధీరుడిగా పోరాడుతారు. చరిత్ర నిర్మాతలు ప్రజలు. నేను ప్రజలను నమ్ముతా. డబ్బును నమ్ముకుంటే గెలుస్త అనుకుంటే పొరపాటే. కేసీఆర్ రాజ్యంలో పోలీసులు కూడా పార్టీ మారాలని కౌన్సిల్ చేస్తున్నారు. ఎవరెన్ని చేసినా తెలంగాణ గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే.." అని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

అంతకుముదు మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కుమారుడు, బీఆర్ఎస్ నాయకులు అజ్మీరా ప్రహ్లాద్ బీజేపీలో చేరారు. రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈటల రాజేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ అన్నీ వర్గాల ప్రజలకు సముచిత స్థానం ఇస్తుందన్నారు. కేంద్రంలో ఉన్న 75 మంది మంత్రుల్లో 27 మంది మంత్రులు బీసీలు ఉన్నారని.. కేవలం బీజేపీలోనే ఇది సాధ్యమైందన్నారు. 12 మంది ఎస్సీ లు, 08 మంది ట్రైబల్ మంత్రులు ఉన్నారని చెప్పారు. ఆదివాసీ మహిళకు అత్యున్నత స్థానం రాష్ట్రపతి పదవి ఇచ్చింది కూడా బీజేపీనే అని అన్నారు.  

Also Read: IND Vs SL Asia Cup Super 4 Match Updates: టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులో మార్పులు.. ఆ ప్లేయర్ ఎంట్రీ..!  

Also Read: Ys jagan on Chandrababu Case: చంద్రబాబు అరెస్టు పరిణామాలపై జగన్ సమీక్ష

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News