Etela Rajender Press Meet Today: బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టింది అని బీజేపి ఎన్నికల ప్రచార కమిటి చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యోగుల విషయానికొస్తే.. 5 నుంచి 6 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు , టీచర్లు , వీఆర్ఏలు, వీఆర్వోలు అందరినీ బీఆర్ఎస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది అని అన్నారు. 14 ఏళ్లు తెలంగాణలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించా. అలాగే రెండు సార్లు పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశా. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఉద్యోగస్తులే ఎక్కువగా తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవాళ్లు. ఎంతోమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు సమయానికి జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి అని దరఖాస్తులు ఇచ్చిన్రు అని అప్పటి పరిస్థితులను ఈటల రాజేందర్ గుర్తుచేసుకున్నారు.
ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలి. ఓటర్లు చైతన్య వంతం కావాలి.. అప్పుడే, తప్పుచేసే వాళ్లను గట్టిగా గల్లా పట్టి అడుగుతారు. తప్పు చేసిన వాళ్లను నిలదీస్తారు. బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో విద్యా వ్యవస్థను నీరుగార్చిర్రు. తండాలు, బస్తీల్లో స్కూళ్లన్నీ మూసేస్తున్రు. రేషనలైజేషన్ పేరిట టీచర్లను తగ్గించుకుపోతున్రు. చాలాచోట్ల గవర్నమెంట్ స్కూళ్లలో స్కావెంజర్లు లేరు. హెడ్మాస్టర్లే వార్డెన్లుగా, అటెండర్లుగా పని చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరి వాళ్లు పిల్లలకు సదువులు చెప్పుకోవాలా లేక ఈ పనులే చేసుకోవాలా అని ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కారుకి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలనే చిత్తశుద్ధి లేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని, తెలంగాణలో సంపదకు కొదువలేదని, అన్నింట్లో నెంబర్ 1 అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు. ఆఖరికి పరిస్థితి ఎలా తయారైందంటే.. భూములను అమ్మితే కానీ రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారింది అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
ఇది కూడా చదవండి : Mynampalli Hanmantha Rao: మైనంపల్లిపై కేసీఆర్ యాక్షన్ తీసుకుంటారా
సమైక్య రాష్ట్రంలో 294 మంది ఉన్న శాసన సభలో అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటానికి టైం ఇచ్చేది. కాని నేడు సొంత రాష్ట్రమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. అందుకే ఇలాంటి అన్ని సమస్యలు, అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుందన్న ఈటల రాజేందర్.. బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతేనే ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి అని స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి : KTR and Kavitha: హన్మంత రావు పేరు ఎత్తకుండానే ఘాటుగా స్పందించిన కేటీఆర్, కవిత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి