నిజాం సర్కారులాంటివారే మంట కలిసిపోయారు..నువ్వు ఎంత: ఈటల

పరకాలలో బహిరంగసభలో సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటన చేయాలని బీజీపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2023, 09:53 PM IST
నిజాం సర్కారులాంటివారే మంట కలిసిపోయారు..నువ్వు ఎంత: ఈటల

ఈ రోజు పరకాలలో జరిగిన తెలంగాణ విమోచన సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి పరకాల అమరధామ వరకు బైక్ ర్యాలీగా చేరుకున్నారు. 

బహిరంగసభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. "కెసిఆర్ కూడా అప్పటి నిజాంలాగా అరెస్టులు చేస్తున్నారు. నిర్బంధాలు విధిస్తున్నారు. స్వేచ్చగా మాట్లాడే అవకాశం అపుడు బ్రిటీష్ పాలనలో మరియు నిజాం పాలనలో లేదని తెలిపారు. ఇపుడు అలాంటి పరిస్థితులు కేసీఆర్ ప్రభుత్వంలో ఉందని చెప్పారు. 

భారత దేశానికి ఆగస్ట్ 15 న స్వాతంత్ర్యం రాగా.. తెలంగాణకు కూడా స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2 వ తేదీన పరకాల చేపల బండ వద్ద జెండా ఎగురవేయడంతో 22 మందిని రజాకార్లు కాల్చి చంపారు. నిజాం నుండి స్వాతంత్య్రం పొందిన సెప్టెంబర్ 17 ను "తెలంగాణ విమోచన దినోత్సవం"గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని పరకాలలోని అంగడి గ్రౌండ్ లో జరిగిన బహిరంగసభలో ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. 

పరకాల ఒక్కటే కాదు దేశవ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకొనేందుకు మోదీగారు అజాదీకా అమృత దినోత్సవ ఉత్సవాలు జరుపుతున్నారు. అమిత్ షా పోయిన సంవత్సరం అదే గడ్డ మీద తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. మళ్ళీ ఎల్లుండి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడానికి ఆయన  తిరిగి వస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే " తెలంగాణ విమోచన దినోత్సవాన్ని" అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. 

Also Read: CM Breakfast Scheme: సీఎం కేసీఆర్ మరో సూపర్ స్కీమ్.. రాష్ట్రంలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్  

కాకతీయ విశ్వ విద్యాలయంలో విద్యార్థులు మార్కులు వచ్చిన వారికి PhD సీట్లు ఇవ్వండి అని అడిగితే.. MLC కి బానిసల్లాగా వ్యవహరిస్తున్న VC.. సీటు అడిగిన పాపానికి టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొట్టించారు. వైస్ చాన్సలర్ నే దగ్గర ఉండి కొట్టించారు. ఇది ప్రజాస్వామ్యం అని మర్చిపోకు కెసిఆర్.. నీకు అధికారం ఇచ్చింది 2023 వరకు మార్గమే.. 

పరకాల మా నియోజకవర్గం పక్కనే ఉంటుంది.. మాది వర్గసంబంధం.. మీది మందు సంబంధం.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచింది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. పరకాల ఎమ్మెల్యే నా ఎన్నికలకు వచ్చి..స్కూల్ లో బ్రాందీ సీసాలు పెట్టీ తాగించారు. మిస్టర్ ఎమ్మెల్యే.. నీ కెసిఆర్ ఆయన జేజెమ్మ దిగి వచ్చిన పరకాల ప్రజలు నీకు ఓట్లు వేయరు. అప్పుల్లో ఉన్న కార్యకర్తలు గుర్తించి డబ్బులు ఇచ్చి లొంగదీసుకుంటున్నారు. కానీ ఆత్మగౌరవం ఉన్నవారు లొంగరు.  కొరపల్లి అనే ఊర్లో మనెమ్మ అనే ఆమెకు 5 లక్షలు తీసుకువచ్చి ఇస్తే.. నాకు వద్దు రాజేందర్ నా సోదరుని లాంటివాడు అని తిప్పిపంపించింది. నిజాం సర్కారులాంటివారే మంట కలిసిపోయారు. నువ్వు ఎంత" అని మండిపడ్డారు. 

Also Read: Man Caught Spitting On Food: ఫుడ్ పార్సెల్‌పై ఉమ్మేసిన డెలివరి బాయ్.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News