ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో గతేడాది డిసెంబర్ 15న విద్యార్థులపై దాడులకు పాల్పడిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి డిమాండ్ చేశారు.
శనివారం సాయంత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ముగిసిన కొన్ని గంటల తరువాత, అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఢిల్లీ పోలీసులతో పాటు సాయుధ పారా మిలటరీ కమాండోల సమక్షంలో తరలించి భద్రపర్చారు.
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఐతే మరోవైపు పోలీసులు మాత్రం నిరసనలపై తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై కేసులు పెడుతున్నారు.
భారత గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు రేపు ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్ కూడా గణతంత్ర దినోత్సవ సంబరాలకు ముస్తాబైంది. మరోవైపు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్.. భారత్ పై అభిమానాన్ని చాటుకుంది.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసతో పాటు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం వరకు ప్రపంచం నలుమూలల చోటుచేసుకుంటున్న అనేక ముఖ్యమైన ఘటనలు, కీలక పరిణామాలు, ఈ క్షణం వరకు ఎక్కడ, ఏం జరుగుతుందో తెలిపే ముఖ్యాంశాల సమాహారమే ఈ సూపర్ ఫాస్ట్ 100 న్యూస్.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో చెలరేగిన హింస వెనుకు ఎవరున్నారు ? ఈ హింస వెనుక ఎవరి కుట్ర దాగి ఉంది ? ఎవరి ప్రోద్బలంతో దుండగులు ఈ దాడులకు పాల్పడ్డారు ? అసలు దుండగులు యూనివర్శిటీ సెక్యురిటీ సిబ్బందికి, పోలీసులకు చిక్కకుండా హాకీ స్టిక్స్, కర్రలు తీసుకుని క్యాంపస్‌లోకి ఎలా వెళ్లగలిగారు ? లేదంటే క్యాంపస్‌లో ఉన్న హాకీ స్టిక్స్, కర్రలతో దుండగులు దాడికి పాల్పడ్డారా ? ఒకవేళ అదే నిజమైతే.. దుండగులు దాడికి ఉపయోగించిన కర్రలు, హాకీ స్టిక్స్ క్యాంపస్‌లోకి ఎలా వచ్చాయి ? ఎవరు తీసుకొచ్చారు ? ఇవే కాదు.. అంతుచిక్కని ఇంకెన్నో సందేహాలకు సమాధానం వెతికే ప్రయత్నమే ''జేఎన్‌యూ హింస వెనుక ఎవరున్నారు ?''.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసతో పాటు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం వరకు ప్రపంచం నలుమూలల చోటుచేసుకుంటున్న అనేక ముఖ్యమైన ఘటనలు, కీలక పరిణామాలు, ఈ క్షణం వరకు ఎక్కడ, ఏం జరుగుతుందో తెలిపే ముఖ్యాంశాల సమాహారమే ఈ సూపర్ ఫాస్ట్ 100 న్యూస్.
జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
జేఎన్‌యూలో హింసకు పాల్పడిన అల్లరిమూకలను కేజ్రీవాల్ సర్కార్ వెనకేసుకొస్తోంది: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగ్రహం
కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ జవహర్లాల్ యూనివర్శిటీలో మళ్లీ కలకలం రేగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత మళ్లీ ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే బుధవారం రాత్రి ఓ 25 ఏళ్ల యువకుడు చారిత్రక కట్టడం ఇండియా గేట్ వద్ద తనకు తాను నిప్పంటించుకోవడం కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించేందుకు వ్యూహం రచిస్తున్న ఇద్దరు తీవ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో ఈ మధ్యకాలంలో ఓ గ్యాంగ్ కొత్త రకం దొంగతనాలకు పాల్పడుతోంది. పథకం ప్రకారం పిజ్జాలను ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. వాటిని పట్టుకొచ్చే డెలివరీ బాయ్స్‌పై దాడులకు పాల్పడడానికి శ్రీకారం చుట్టింది ఓ ముఠా.
హర్యానాలోని అంబాలా ప్రాంతానికి చెందిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కి గూగుల్ సంస్థలో జాబ్ చేయాలని కోరిక. ఎన్నో ఇంటర్వ్యూల తర్వాత ఆఖరికి ఆ సంస్థలో ఉద్యోగం దొరకడంతో ఆయన ఆనందానికే హద్దులు లేకుండా పోయింది. లక్షల జీతం వచ్చే ఉద్యోగంలో చేరాక.. ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా పరిచయమైంది.
హైదరాబాద్‌కు చెందిన సఫ్రుద్దీన్ కొంతమంది స్నేహితులతో కలిసి గతకాలంగా ఢిల్లీలో కార్ల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అధునాతనమైన సాఫ్ట్ వేర్, జీపీఎస్‌తో పాటు లేటెస్ట్ మొబైల్ టెక్నాలజీని ఉపయోగించి సఫ్రుద్దీన్ ఈ దొంగతనాలకు పాల్పడేవాడు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.