ద్విచక్రవాహనదారుడి ప్రాణం తీసిన గాలిపటం మాంజ

గాలిపటం మాంజ గొంతుకు కోసుకుని ద్విచక్రవాహనదారుడు మృతి

Last Updated : Aug 17, 2019, 12:13 AM IST
ద్విచక్రవాహనదారుడి ప్రాణం తీసిన గాలిపటం మాంజ

ఢిల్లీ: గాలిపటం మాంజ గొంతుకు కోసుకోవడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన ఢిల్లీలో గురువారం చోటుచేసుకుంది. పశ్చిమ్ విహార్‌లో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మానవ్ శర్మ అనే వ్యక్తి గొంతుకు గాలిపటం మాంజ తగిలింది. గొంతులో నరాలు తెగడంతో మానవ్ శర్మ మృతిచెందాడు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 

స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా గాలిపటాలు ఎగురవేయడం ఢిల్లీలో ఓ ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. 

Trending News