ఇండియా గేట్ వద్ద తనకు తానే నిప్పంటించుకున్న యువకుడు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే బుధవారం రాత్రి ఓ 25 ఏళ్ల యువకుడు చారిత్రక కట్టడం ఇండియా గేట్‌ వద్ద తనకు తాను నిప్పంటించుకోవడం కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఇండియా గేట్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది.

Last Updated : Dec 18, 2019, 11:35 PM IST
ఇండియా గేట్ వద్ద తనకు తానే నిప్పంటించుకున్న యువకుడు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే బుధవారం రాత్రి ఓ 25 ఏళ్ల యువకుడు చారిత్రక కట్టడం ఇండియా గేట్‌ వద్ద తనకు తాను నిప్పంటించుకోవడం కలకలం సృష్టించింది. ఇండియా గేట్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్న యువకుడిని అక్కడే ఉన్న ఢిల్లీ పోలీసులు సమీపంలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రికి (Ram Manohar Lohia hospital) తరలించారు. 90 శాతం కాలిన గాయాలయ్యాయని ఆర్ఎంఎల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 

ఈ అఘాయిత్యానికి పాల్పడిని యువకుడిని ఒడిశాకు చెందిన కార్తిక్ మెహర్ గుర్తించిన ఢిల్లీ పోలీసులు.. అతడికి మతిస్థిమితం లేదని, అతడి ఆత్మహత్యాయత్నానికి పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Trending News