ఢిల్లీలో దారుణం: పోలీస్ అధికారి కుమార్తెని బెదిరించి రేప్ చేసిన ఇంటర్ విద్యార్థి

దేశ రాజధాని ఢిల్లీలో ఓ భయానకమైన సంఘటన చోటుచేసుకుంది. 

Last Updated : Aug 30, 2018, 07:45 PM IST
ఢిల్లీలో దారుణం: పోలీస్ అధికారి కుమార్తెని బెదిరించి రేప్ చేసిన ఇంటర్ విద్యార్థి

దేశ రాజధాని ఢిల్లీలో ఓ భయానకమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ పోలీస్ అధికారి కుమార్తెని 17 ఏళ్ల యువకుడు బెదిరించి పలుమార్లు రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన వ్యక్తి కూడా మరో పోలీస్ ఉద్యోగి కొడుకు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఓ 17 ఏళ్ల యువకుడు .. తన తండ్రి తోటి ఉద్యోగి కుమార్తెపై గత కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఈ ఘటనలో బాధితురాలైన బాలికకి, నేరానికి పాల్పడిన యువకుడికి ముందుగానే పరిచయం ఉంది. వీరిద్దరూ కూడా వేరు వేరు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నారు.

తొలుత కొన్నాళ్లు బాలికతో స్నేహం చేసిన యువకుడు... ఓ రోజు ఆమెను పార్టీకని పిలిపించి కూల్ డ్రింక్స్‌లో డ్రగ్స్ కలిపి ఇచ్చాడు. ఆమె నిద్రించిన తర్వాత.. ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యకరమైన వీడియో తీశాడు. తర్వాత అదే వీడియో ఆమెకు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ.. అనేకసార్లు ఆమెను బలవంతంగా తన గెస్ట్ హౌస్‌కి రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవలే ఆ యువకుడు బాలిక ఇంటికి వచ్చి ఆమెను బెదిరిస్తుండగా.. వారి సంభాషణను చాటుగా విన్న అమ్మాయి తండ్రి.. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని గదమాయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో బాధితురాలు ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక కావడం గమనార్హం. ఢిల్లీలోని ద్వారకా ప్రాంత పోలీస్ స్టేషనులో నేరానికి పాల్పడిన యువకుడిపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తను నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. జూవైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాల మేరకు ఆ యువకుడిని అబ్జర్వేషన్ హోమ్‌కి పంపించారు. అతని మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకొని.. అందులో అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసేందుకు వాడిన 8 వీడియో క్లిప్స్‌ను కూడా సీజ్ చేశారు. 

Trending News