Windfall Tax on Crude Oil: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రూడ్ ఉత్పత్తులు, పెట్రోల్ డీజీల్ సహా విమాన ఇంధనం వంటి వాటిపై విండ్ ఫాల్ టాక్స్ రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఎంతో కాలం నుంచి ఈ దిశగా చర్చలు జరిపిన కేంద్రం సోమవారం ఎట్టకేలకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. రియలన్స్, ఓఎన్జీసీ వంటి చమురు కంపెనీలకు ఈ నిర్ణయం ఎంతో మేలు జరుగుతుంది.
ONGC Crude Oil: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ దశాబ్దాల అణ్వేషణ ఫలిస్తోంది. ఇప్పటి వరకూ కృష్ణా గోదావరి బేసిన్లో కేవలం గ్యాస్ నిక్షేపాలే బయటపడటం తెలుసు. తాజాగా క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు వెలుగుచూస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Union Govt Slashes Windfall Tax: ముడి చమురు, డీజిల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. తగ్గించిన కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా రేట్ల వివరాలు ఇలా..
KTR Writes Open Letter to Centre: మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ అనేక అంశాలను మంత్రి కేటీఆర్ ఈ లేఖలో ప్రస్తావించారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.
Domestic Crude Oil: చమురు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్‌కు రూ.5 నుంచి రూ.1.5కు తగ్గించారు.
Petrol price: దేశంలో పెట్రో ధరల మోత మోగుతోంది. గత కొన్ని రోజులుగా రేట్లు మరింత పైపైకి చేరుతూ సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పెట్రోల్ ధరలు ఎంత మేర పెరిగాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
Petrol price Today: దేశంలో పెట్రోల్ ధరల మంట ఆగటం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో ధర పెరుగుతూ వాహనదారులకుకు మోయలేని భారంగా మారుతోంది. తాజాగా డీజిల్ ధరలు కూడా పలు నగాల్లో రూ.100 దాటింది.
Petrol price Today: వాహనదారులకు చేదు వార్త. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రేట్లు ప్రియమయ్యాయి. హైదారాబాద్ సహా వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
Petrol price Today: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రికార్డు స్థాయి వద్ద కొనసాగుతున్న దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.
ATF price hike: విమానాల్లో వాడే ఇంధనం (ఏటీఎఫ్) ధర రికార్డు స్థాయిలో పెరిగింది. బుధవారం పెంచిన రేట్లతో తొలిసారి కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.లక్ష దాటింది. ముడి చమురు ధరలు భారీగా పెరగటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Rupee Value: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనమైంది. ఫోరెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ ఏకంగా 1 శాతానికిపైగా క్షీణించింది. దీనితో మారకం విలువ జీవనకాల కనిష్ఠానికి దిగజారింది.
Petrol price hike: పెట్రోల్, డీజిల్ ధరలు రేపటి నుంచి ఆకాశన్నంటున్నాయా? పెరుగుదలకు కారణాలు ఏమిటి? ధరలు ఎంత పెరగొచ్చు? అనే విషయంపై నిపుణుల విశ్లేషణ చూద్దాం.
Petrol Price: దసరా రోజు కూడా పెట్రోల్ ధరల నుంచి దేశ ప్రజలకు ఊరట లభించడం లేదు. దిల్లీలో (Petrol Price in Delhi) లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.105.14కి చేరగా.. లీటర్ డీజిల్ రూ.93.88కు పెరిగింది.
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చైర్మన్ సంజీవ్ సింగ్ వాహనదారులకు షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ''లో ఎమిషన్ BS-VI'' పరిజ్ఞానం కలిగిన ఇంధనాన్ని అందుబాటులో తీసుకొస్తున్నామని సంజీవ్ సింగ్ పీటీఐకి తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీ సహా హైదరాబాద్, అమరావతి, విజయవాడల్లో శుక్రవారం నవంబర్ 15న డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ పెట్రోల్ ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.
ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన ఇంధనం ధరల్లో మళ్లీ క్రమక్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో భారత్‌లోని వివిధ నగరాల్లో శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.