Petrol price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు- హైదరాబాద్​, వైజాగ్​లలో ప్రస్తుత రేట్లు ఇలా..

Petrol price Today: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రికార్డు స్థాయి వద్ద కొనసాగుతున్న దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 12:35 PM IST
  • దేశవ్యాప్తంగా స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
  • క్రూడ్​ ధరలు మాత్రం రికార్డు స్థాయి వద్దే..
  • ఇటీవలే జీవనకాల గరిష్ఠానికి ఏటీఎఫ్ ధరలు!
Petrol price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు- హైదరాబాద్​, వైజాగ్​లలో ప్రస్తుత రేట్లు ఇలా..

Petrol Price in India: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా మడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం. అయితే పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా విమానాల్లో వాడే ఇంధనం (ఏటీఎఫ్) ధఱలను మాత్రం భారీగా పెంచాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు. ప్రస్తుతం ఏటీఎఫ్​ ధరలు ఆల్​టైం రికార్డు స్థాయి వద్ద ఉండటం విశేషం.

ముడి చమురు ధరల్లో పెరుగుదల ఇలానే కొనసాగితే త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశముందని విశ్లేషణలు వస్తున్నాయి. మరోవైపు రష్యా నుంచి తక్కువ ధరకే ముడి చమురు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ధరలు స్థిరంగా కొనసాగొచ్చనే అంచనాలు కూడా వస్తున్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుత ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో పెట్రోల్ ధర లీటర్​ రూ.108.18 ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.94.61 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్ పెట్రోల్​, డీజిల్ ధరలు వరుసగా రూ.109.03, రూ.95.17 వద్ద ఉన్నాయి.

ఇతర మెట్రో నగరాల్లో ఇంధన ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 వద్ద, లీటర్ డీజిల్ ధర రూ.86.67 వద్ద ఉంది.
  • చెన్నైలో పెట్రోల్ ధర లీటర్​ రూ.101.40 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.91.43 వద్దకు కొనసాగుతోంది.
  • బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్​ రూ.100.20 వద్ద విక్రయమవుతోంది . లీటర్ డీజిల్ ధర రూ.85.01 వద్దకు ఉంది.
  • దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర లీటర్ రికార్డు స్థాయిలో రూ.109.98 వద్దకు ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.94.14 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటర్​కు.. ధర రూ.104.68,​ రూ.89.79 వద్ద కొనసాగుతున్నాయి.

Also read: Edible Oil Price: వంట నూనెల ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం?

Also read: Nexon EV price hike: నెక్సాన్​ ఈవీ ధర రూ.25,000 వేల వరకు పెంపు- కొత్త ధరలు ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News