Padi Kaushik reddy attack on jagtial mla Sanjay: తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య తగ్గా ఫార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. రేవంత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఒక వైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలపైన ముందుకు వెళ్తునే.. మరొవైపు బీఆర్ఎస్ ను ఏకీపారేస్తున్నారు. గత పాలకుల మోసపూరిత విధానాల వల్ల.. తెలంగాణ పదేళ్లు వెనక్కిపోయిందని ఎద్దేవా చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా మైక్ గుంజుకున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
సంజయ్‌ను "ఒరేయ్ ఏ పార్టీరా నీది" అంటూ సంబోధించిన కౌశిక్ రెడ్డి pic.twitter.com/yqoI3e0FWq
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2025
అంతే కాకుండా.. ప్రజలను మోసం చేశారన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ నుంచి పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నేతలు అవకాశం చిక్కినప్పుడల్లా వీరిని ఏకీపారేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు కరీంనగర్ జిల్లాలో..జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. దీనిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు.
అదే విధంగా అక్కడికి వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి .. సంజయ్ తో వాగ్వాదానికి దిగారు. అసలు.. నువ్వు ఏ పార్టీలో ఉన్నావని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వేసిన బిచ్చంతో గెలిచి.. ఈరోజు మరో పార్టీలో చేరావని ఏకీ పారేశారు. సిగ్గు,లజ్జ, మానం ఉంటే.. మొగుడివైతే.. రాజీనామా చేసి ఎన్నికలలో గెలవాలని సంజయ్ కు సవాల్ విసిరారు. అంతేకాకుండా.. బోసిడికే.. బాడ్ కావ్.. సిగ్గులేదా.. అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను ఏకీపారేశారు. తన నియోజక వర్గం మీద రేవంత్ సర్కారు కావాలని.. చిన్న చూపుచూస్తున్నారని.. నిధులు మంజురు చేయడం లేదని ఫైర్ అయ్యారు. తాను దళిత బంధు పథకం, బీసీ బంధు, ఇతర నిధుల కోసం ప్రశ్నిస్తున్నందుకు తన మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి బైటకు పంపించి వేశారు. అయితే.. ఈ క్రమంలో మరల తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయాలు హీట్ ను పెంచేదిగా మారాయని చెప్పుకొవచ్చు. ఈ ఎమ్మెల్యేల గొడవలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter