Fire Accident In West Bengal Cracker Factory: అనుమతులు లేకుండా నివాసాల మధ్య నిర్వహిస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Road Accident in Kerala: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జీపులో లోయలో పడిపోవడంతో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Two Men Cheated People With Rs 1500 cr Debts: రూ. 100 కోట్ల వరకు అప్పు ఇచ్చిన విజయవాడలోని ఒక బార్ నిర్వాహకులు, అప్పు తీర్చాల్సిందిగా కొద్ది రోజుల నుంచి వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలిసింది. రేపు మాపు అంటూ ఫోన్ కూడా ఎత్తకపోవడంతో కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అనుచరులతో కలిసి బార్ నిర్వాహకులు 4 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు.
Mizoram Railway Bridge Collapses: మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాలను వెలికి తీస్తుండగా.. గాయనపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఎన్ని చట్టాలు తెచ్చిన.. ఎన్ని సవరణలు చేసిన.. మహిళలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయం అయితే మరీ దారుణంగా మారింది. పిల్లలని స్కూల్ కి పంపాలన్న భయపడాల్సిన పరిస్థితి. 13 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి.. దారుణంగా కొట్టి చంపిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మహిళల్లో కొంత మంది డబ్బు సంపాదించటం కోసం ఎంత ఘోరానికి అయినా తలపడుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వీరి హల్ చల్ ఎక్కువగా ఉంది. అబ్బాయిలు ఈ హానీ ట్రాప్ లలో చిక్కుకొని భారీగా నష్టాలని చవి చూస్తున్నారు.
Bus Accident In Uttarakhand: ఉత్తరాఖండ్‌లో గంగోత్రి జాతీయ రహదారిపై లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 27 మంది సురక్షితులయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Journalist Murder Case: బీహార్‌లో ఓ జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున డోర్ కొట్టిన దుండగులు.. తలుపు తీయగానే తుపాకీతో కాల్చారు. మృతుడు ఓ దిన పత్రికలో స్థానికంగా రిపోర్టర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Man in Burqa Enters Ladies Washroom In Lulu Shopping Mall: బీటెక్ గ్రాడ్యూయేట్ అయిన అభిమన్యుని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఐపీసీ 354 ( C), 419, ఐటి యాక్టులోని సెక్షన్ 66 E కింద కేసు నమోదు చేశారు. అభిమన్యుని కోర్టులో హాజరుపరచగా, కోర్టు నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
స్త్రీ, పురుషులు అంటూ తేడా లేకుండా.. సహాయం అర్థిస్తూ.. సాధారణ జనాలపై దాడి చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి జైపూర్ లో జరిగింది. మంచి నీళ్లు కావాలని మహిళని అడగటం.. ఆమెపై దాడి చేసి దోచుకెళ్లిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Hyderabad Eve-teasing case: కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా వెళ్తున్న మహిళ వెంటపడి బలవంతంగా తాకుతూ ఈవ్ టీజింగ్ కి పాల్పడిన యువకుడికి కోర్టు 16 రోజుల జైలు శిక్ష విధించింది. నాంపల్లి 10వ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టులో నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీని హాజరు పరచగా.. కోర్టు నిందితుడికి 16 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
Road Accident In Warangal: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. లారీ డ్రైవర్ మద్యం మత్తులో నడపడం వల్లే ప్రమాదనికి కారణని అనుమానిస్తున్నారు.
Power Bill Cyber Cheating: తూర్పు గోదావరి జిల్లా ఉండి మండలంలో ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల ఉచులో పడిపోయాడు. కరెంట్ బిల్లు పేరుతో రూ.1.82 లక్షలు పోగొట్టుకున్నాడు. అది కూడా ఆలస్యంగా గుర్తించి.. పోలీసులను ఆశ్రయించాడు.
IRCTC Fraud Alert: ఐఆర్సీటీసీలో టికెట్ క్యాన్సిలేషన్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.4 లక్షలు దోచేశారు. కేరళకు చెందిన ఓ వృద్ధుడికి మాయ మాటలు చెప్పి.. మొబైల్‌ను హ్యాక్ చేశారు. వెంటనే అకౌంట్ మొత్తం ఖాళీ చేసేశారు. పూర్తి వివరాలు ఇలా..
Assam BJP Leader Indrani Tahbildar Death News: బీజేపీ నాయకుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు లీక్ కావడంతో కిసాన్ మోర్చా కోశాధికారి ఇంద్రాణి తహబీల్దార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
కఠినంగా శిక్షించే చట్టాలు ఎన్ని ఉన్న మహిళలపై జరిగే అఘాయిత్యాలు తగ్గటం లేదు. శంషాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం అయింది. ఆ వివరాలు
VRA Suicide Attempt: తమ తాతలు, తండ్రుల కాలం నుండి ఇదే ఉద్యోగాన్ని చేసుకుంటూ బతుకీడుస్తున్నామని.. కొత్తగా తమని కాదని తన తండ్రి హుస్సేన్ ఉద్యోగాన్ని అధికారులు అర్హత లేని మరో వ్యక్తికి అమ్ముకున్నారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. డిప్యూటీ తహశీల్ధార్ తరంగిణి అవతలి వ్యక్తి వద్ద లంచం తీసుకుని తమకు అన్యాయం చేస్తోందని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.
Cable Track Accident In NTPC: పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ యూనిట్-1లో కన్వీనర్ బెల్ట్ ట్రాక్ తెగి పడడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు కార్మికులు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Baby Girl Exchanged With Baby Boy: మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లలను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేసి ఒకరికి పుట్టిన బాబును తీసుకెళ్లి మరొక తల్లికి అప్పగించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనకు బాధ్యులైన మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఎస్.ఎన్.సి.యు సిబ్బంది నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Bhilwara Gang Rape And Murder Case: రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుమార్తె అంత్యక్రియల్లో చితిపై దూకి తండ్రి ఆత్మహత్యయత్నం చేశాడు. బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అతి కిరాతంగా హత్య చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.