Cable Track Accident In NTPC: అనకాపల్లి జిల్లాలోని పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. ఎన్టీపీసీ యూనిట్-1లో ఫ్లోగ్యాస్ డీశాలినేషన్ పనులు జరుగుతుండగా.. కన్వీనర్ బెల్ట్ ట్రాక్ తెగి పడింది. దీంతో కొంతమంది కార్మికులు 15 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గు తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను విశాఖపట్నంలోని కేజీహెచ్ తరలించారు. మృతులనుపశ్చిమ బెంగాల్ చెందిన కార్మికులుగా గుర్తించారు.
గురువారం మధ్యాహ్నం కన్వీనర్ బెల్ట్ ట్రాక్ రిపేర్ వర్క్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా బెల్ట్ ట్రాక్ తెగిపడిపోవడంతో 15 మీటర్ల ఎత్తులో పని చేస్తున్న కార్మికులు కిందపడ్డారు. ఇద్దరు కార్మికులు ప్రమాదస్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రమాదం అనంతరం స్వల్పంగా మంటలు వ్యాపించాయి. దీంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సింహాద్రి ఎన్టీపీసీ స్పందించి.. పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. బెల్ల్ ట్రాక్ తెగిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read: Hyderabad Metro: మెట్రో రైల్ విస్తరణపై వేగంగా అడుగులు.. మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ రివ్యూ
Also Read: RBI Repo Rate: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook