Road Accident in Kerala: కేరళలో ఓ జీపు 25 మీటర్లలో లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీపు.. వయనాడ్ సమీపంలోని మనంతవాడిలోని తవిన్‌హాల్ గ్రామ పంచాయతీ సమీలోని శుక్రవారం లోయలో పడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్య్కూ బృందాల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
మరణించిన వారు టీ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తోన్న కూలీలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతులను తాళ్లపూజ సమీపంలోని మక్కిమలకు చెందిన రాణి, శాంతి, చిన్నమ్మ, లీల, రబియా, షీజ, శోభన, మేరీ, వసంతలుగా గుర్తించారు. శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు తాళప్పుజా వద్ద కన్నోత్మల సమీపంలో వాహనం ఒక తోట నుంచి కార్మికులను తీసుకువెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జీపు మొత్తం ధ్వంసమైంది. కిందపడిన తాకిడికి వాహనం రెండుగా చీలిపోయింది. గాయపడిన వారు వాయనాడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. కోజికోడ్‌లో ఉన్న అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్‌ను ప్రమాద స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స సహా అన్ని చర్యలను సమన్వయం చేయాలని.. ఇతర అవసరమైన పనులను చేపట్టాలని సూచించారు.
ఈ విషాద సంఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. వాయనాడ్‌లోని మనంతవాడిలో తేయాకు తోటల కార్మికులు మరణించడం బాధించిందని పేర్కొన్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి.. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. తన ఆలోచనలు దుఃఖంలో ఉన్న కుటుంబాలతో ఉన్నాయని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Also Read: Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఆటగాళ్లందరికీ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook