Journalist Murder Case: బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. అరారియా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ జర్నలిస్టును కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన రాణిగంజ్ బజార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడిని విమల్ కుమార్ యాదవ్‌గా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని విమల్ కుమార్ తలుపు తట్టి శుక్రవారం ఉదయం 5:30 గంటలకు అతని పేరు పిలిచారు. ఆయన తలుపు తెరవగానే వెంటనే ఛాతీపై కాల్చారు.
"రాణిగంజ్ బజార్ ప్రాంతంలో విమల్ కుమార్ యాదవ్ అనే జర్నలిస్టును గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది. హత్యా స్థలానికి డాగ్ స్క్వాడ్‌ను పిలిపించాం.దర్యాప్తు కొనసాగుతోంది" అని అరారియా ఎస్పీ అశోక్ కుమార్ సింగ్ తెలిపారు.
జర్నలిస్టు హత్య ఘటనపై సీఎం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. పూర్తి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. విమల్ కుమార్ యాదవ్ (35) దైనిక్ జాగరణ్ వార్తాపత్రికలో స్థానిక జర్నలిస్టుగా పనిచేశాడని పోలీసులు తెలిపారు. హత్యకు పాత శత్రుత్వమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
రెండేళ్ల క్రితం సర్పంచ్‌గా ఉన్న విమల్ కుమార్ యాదవ్ సోదరుడు కూడా ఇదే విధంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసులో విమల్‌కుమార్ యాదవ్ ప్రధాన సాక్షిగా ఉండగా.. సాక్ష్యం చెప్పొందంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ బెదిరింపులకు వెనక్కి తగ్గని విమల్ కుమార్... కోర్టు విచారణలో తన సోదరుడి హంతకుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. ఈ నేపథ్యంలోనే విమల్ కుమార్ హత్యకు గురికావడం స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది. మృతుడికి భార్యా, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Also Read: Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్‌ఏ ఒక్కటే.. ఒకే గూటి పక్షులు: కిషన్ రెడ్డి
Also Read: 3D Printed Post Office: దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రశంసల వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి