India Corona Cases Today: దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా రెండు లక్షలకు చేరువగా.. అనగా 1,94,720 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా ధాటికి 442 మంది ప్రాణాలు విడిచారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కు చేరింది.
India Covid Cases Today: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,68,063 మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. మరోవైపు కరోనా ధాటికి 277 మంది ప్రాణాలు విడిచారు. 69,959 మంది కొవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య దేశంలో 4,461కు చేరింది.
Antigen Test Kit Procedure: మీరు కరోనా లక్షణాలతో బాధపడుతున్నారా? అయితే కరోనా పరీక్ష చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాలంటే వెనకాడుతున్నారా? అయితే ఇప్పుడు ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న కారణంగా ప్రజల్లో భయాందోళలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను పాలించే నాయకులు సహా రక్షణగా ఉండే పోలీసులూ కొవిడ్ బారిన పడడం మరింత కలవరానికి గురిచేస్తుంది. ఎప్పుడూ ప్రజల్లో ఉండే వీరూ కరోనా బారిన పడడం వల్ల వైరస్ ఎంత మేర వ్యాప్తి చెందిందనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల్లో 1000 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు.
India Corona Cases Today: ఇండియాలో కరోనా కేసులు మరోసారి భారీ స్థాయిలో నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 1.79 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌తో మరో 146 మంది మరణించారు. 46,569 మంది కొవిడ్‌ని జయించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య 4,033కు చేరింది.
Bandla Ganesh Corona: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి కరోనా బారిన పడ్డారు. అదే విషయాన్ని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రజలంతా కరోనా వైరస్ నుంచి అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
Thaman Corona Positive: టాలీవుడ్ కు చెందిన మరో సెలబ్రిటీ కరోనా బారిన పడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత ఎస్ ఎస్ తమన్ కు కరోనా సోకింది. ఇదే విషయాన్ని పలువురు సినిమా పీఆర్ఓలు సోషల్ మీడియాలో తెలిపారు.
Mahesh Babu Shilpa Shirodkar: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వదిన, నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. నాలుగు రోజులుగా కరోనాతో పోరాటం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.