Thaman Corona Positive: టాలీవుడ్ లో కరోనా కలవరం.. తమన్ కు కొవిడ్ పాజిటివ్

Thaman Corona Positive: టాలీవుడ్ కు చెందిన మరో సెలబ్రిటీ కరోనా బారిన పడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత ఎస్ ఎస్ తమన్ కు కరోనా సోకింది. ఇదే విషయాన్ని పలువురు సినిమా పీఆర్ఓలు సోషల్ మీడియాలో తెలిపారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 01:46 PM IST
    • మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కు కరోనా పాజిటివ్
    • కొద్దిపాటి లక్షణాలతో ఐసోలేషన్ కు వెళ్లిన తమన్
    • త్వరగా కోలుకోవాలి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్
Thaman Corona Positive: టాలీవుడ్ లో కరోనా కలవరం.. తమన్ కు కొవిడ్ పాజిటివ్

Thaman Corona Positive: దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. థర్డ్‌వేవ్‌ ఆందోళనలు నిజం చేస్తూ రోజూ వేలాదిమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఈ వైరస్‌ బాధితుల జాబితాలో చేరుతున్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కొవిడ్‌కు గురవుతున్నారు. 

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డాడు. కొద్దిపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్ లో వైద్యుల సూచనలను పాటిస్తున్నట్లు మహేష్ బాబు సోషల్ మీడియాలో తెలిపారు. 

ఇప్పుడు మరో టాలీవుడ్ సెలబ్రెటీ కరోనా బారిన పడ్డారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ కొవిడ్ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పలువురు పీఆర్ఓలు సోషల్ మీడియాలో వెల్లడించారు. తమన్ కు కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు తమన్ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సెలబ్రిటీలు ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం తమన్ చేతిలో పదికిపైగా సినిమాలు ఉన్నాయి. వీటితోపాటే 'రాధేశ్యామ్' లాంటి పాన్ ఇండియా చిత్రానికి, పలు చిన్న సినిమాలకు బ్యాక్​గ్రౌండ్​ స్కోరు అందిస్తూ బిజీగా ఉన్నారు.

ఇప్పటికే టాలీవుడ్​లో మహేశ్​బాబు, మంచు లక్ష్మి, విశ్వక్​సేన్​ తదితరులకు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం వీరంతా హోం క్వారంటైన్​లో ఉన్నారు.

Also Read: Saami Saami Video Song: పుష్ప మూవీ నుంచి మరో సర్ ప్రైజ్.. సామి సామి వీడియో సాంగ్ రిలీజ్

Also Read: O Antava Song Rehearsal: వీడు నన్ను చంపేశాడు- సమంత సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News