India Corona Cases Today: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,79,723 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి ధాటికి మరో 146 మంది మృతి చెందారు.
మరోవైపు 46,569 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,57,07,727 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,83,936 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 7,23,619 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,45,00172 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
COVID19 | India reports 1,79,723 fresh cases & 146 deaths in the last 24 hours
Active case tally reaches 7,23,619. Daily Positivity rate at 13.29%
Omicron case tally at 4,033 pic.twitter.com/bOTWBFwuxN
— ANI (@ANI) January 10, 2022
ఇండియా ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో వ్యాక్సినేషన్
దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 29,60,975 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,51,94,05,951కు చేరింది.
ప్రపంచంలో కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 1,856,698 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,78,83,849 దాటింది. మరో 3,318 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 55,05,854కి చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
India Corona Cases Today: ఇండియాలో మరోసారి లక్షన్నర దాటిన కరోనా కేసులు- 146 మరణాలు