India Covid Cases Today: ఇండియా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,68,063 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిన్నటితో పోల్చుకుంటే 11,660 కేసులు తగ్గాయి. కరోనా వల్ల మరో 277మంది మృతి చెందినట్లు పేర్కొంది.
మరోవైపు 69,959 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,461కు చేరింది.
COVID-19 | India reports 1,68,063 fresh cases, 69,959 recoveries & 277 deaths in the last 24 hours
Active case tally reaches 8,21,446. Daily positivity rate (10.64%)
Omicron case tally at 4,461 pic.twitter.com/ikKRh2Xh6G
— ANI (@ANI) January 11, 2022
దేశంలో కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,58,75,790 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,84,213 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 7,23,619 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,45,70,131 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ
Total 69,31,55,280 samples tested up to January 10 of which 15,79,928 were tested yesterday: Ministry of Health pic.twitter.com/Vd48vfJ5jX
— ANI (@ANI) January 11, 2022
ఇండియాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 92,07,700 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,52,89,70,294కు చేరింది.
ప్రపంచంలో కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 21,041,50 మందికి వైరస్ సోకింది. 4,608 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 311,019,858 నమోదవ్వగా.. కరోనా మరణాలు 5,511,955కు చేరాయి.
Also Read: Modi Sends Footwear: కాశీ శివుని గుడిలోని సిబ్బందికి 100 జతల చెప్పులు పంపిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?
Also Read: Corona Third Wave: సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ ప్రమాదకరమైందంటున్న కేంద్ర ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి