కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి ఏళ్ల తరబడి కొనసాగి రీ ఇన్‌ఫెక్షన్‌కు గురవకుండా రక్షణ కల్పించే వ్యాధి నిరోధక కణాలు సరిపడా తయారై ఉంటాయి కనుక వీళ్లకు పదే పదే కరోనా వ్యాక్సినేషన్ కూడా అవసరం ఉండదు అంటున్నారు పరిశోధకులు.
కరోనావైరస్ నుంచి కోలుకుని 19 నుండి 81 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 185 మంది నుంచి రక్తాన్ని సేకరించి పరీక్షించగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ అధ్యయనంలో వారి శరీరాల్లో వైరస్‌తో సమర్దంగా పోరాడే బీ, టీ లింపోసైట్ కణాల సంఖ్య విపరీతంగా పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు. అలా పెరిగిన కణాలు వారి శరీరంలో ఏళ్ల తరబడి ఉండి, శరీరం మరోసారి ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
వీరి శరీరాల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో తయారయ్యే యాంటీబాడీలు కూడా ఆలస్యంగా అంతరిస్తున్నట్టు వారు గుర్తించారు. కరోనావైరస్ నుంచి కోలుకున్న కొవిడ్ పేషెంట్స్ శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కొవిడ్ వైరస్‌తో ఏళ్లతరబడి పోరాడి మళ్లీ వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది.
ఇలాంటి ఙ్ఞాపకశక్తి ఫలితంగా ఏళ్లతరబడి వైరస్‌తో కూడిన వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గే వీలు ఉంటుంది అంటున్నారు పరిశోధకులు.
COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్‌తో వీళ్లకు పనిలేదట..