ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అసమ్మతి నాయకులు పార్టీలను వీడి మరో పార్టీలో చేరుతున్నారు. బీజేపీని వీడి సొంత గూటికి చేసిన రాజ్ గోపాల్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?
Minister Harish Rao: గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది రాజీనామా చేశారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆయనతోపాటు మరికొందరు నాయకులు గులాబీ గూటికి చేరుకున్నారు.
Congress Mulugu Public Meeting: దేశంలో బీజేపీపై తాము యుద్ధం చేస్తున్నామని.. కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు రాహుల్ గాంధీ. తాము ఏ హామీ ఇచ్చినా.. తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.
మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు.. ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నరు. తెలంగాణాకి వచ్చే వారందరికీ స్వాగతం.. వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూసి వెళ్ళండి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.
Congress Party Counter to Minister KTR: ప్రవళ్లిక ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్ట స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేయలేదని కేటీఆర్ వ్యాఖ్యానించగా.. దరఖాస్తులతో ట్విట్టర్ రిప్లై ఇచ్చింది కాంగ్రెస్.
Shashidhar Reddy Joins in BRS: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డి గెలుపునకు మంత్రి హరీష్ రావు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిని బీఆర్ఎస్లోకి రప్పించి.. కాంగ్రెస్కు చెక్ పెట్టారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రచారాలు వేడెక్కనున్నాయి. బీఆర్ఎస్ అధినేత అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తవగా.. ఇపుడు ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించేశాడు. కాకపొతే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటన కూడా చేయకపోవటం విశేషం.
తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా ప్రతివిమర్శలు చేస్తూ.. కొనసాగుతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ కర్ణాటక ప్రభుత్వం పై చేసిన ట్వీట్ కు సమాధానంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసాడు. ఆ వివరాలు..
Minampalli Hanmantha Rao: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, ఆయన కొడుకు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భువనగిరి నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నక్క ప్రభాకర్ కూడా వారితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Revanth Reddy Satires on KCR, KTR: విజయభేరీ సభ చూసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు చలి జ్వరం వచ్చింది. ప్రగతి భవన్ ను ఖాలీ చేయాల్సి వస్తుందేమో అన్న భయం కేసీఆర్ లో మొదలయింది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్లో చేరుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. ఈ నెల 27వ తేదీలోపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. తనకు మద్దతు ఇచ్చిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
YSRTP Congress Merger: కాంగ్రెస్ పార్టీకి డెడ్లైన్ విధించారు వైఎస్ షర్మిల. ఈ నెల 30వ తేదీలోపు విలీనంపై నిర్ణయం తీసుకోకపోతే.. 119 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడిపోయింది.
Kishan Reddy Press Meet: రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగేలా వ్యవహరిస్తోందని.. బీజేపీ బలపడకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.