దళిత బంధులో 30 శాతం కమీషన్లు.. లిక్కర్ స్కామ్ లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసింది: రేవంత్ రెడ్డి

తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా ప్రతివిమర్శలు చేస్తూ.. కొనసాగుతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ కర్ణాటక ప్రభుత్వం పై చేసిన ట్వీట్ కు సమాధానంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసాడు. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2023, 05:48 PM IST
దళిత బంధులో  30 శాతం కమీషన్లు.. లిక్కర్ స్కామ్ లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసింది: రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా రాజకీయ సమీకరణాలు మారుతూ  వస్తున్నాయి. బీఆర్ఎస్ నేత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పటి నుండి.. నేతలు పార్టీలు మారుతున్నారు. ప్రత్యర్థుల విమర్శలు.. బడా నేతలు వరుసగా తెలంగాణలో సంచరించటం ప్రారంభించారు.  

ఇక ట్విట్టర్ లో కూడా నేతలు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే! ఇక విషయానికి వస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో మంత్రి కెటీఆర్ ను తెగ విమర్శలు చేశారు. ఇపుడు ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.

మొదటగా మంత్రి కెటీఆర్ కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ ను విమర్శలు చేశారు. దానికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఇందులో మంత్రి కెటీఆర్.. "కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల కొరకు తెలంగాణ కాంగ్రెస్‌కు నిధులు సమకూర్చటానికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకి ₹500 "రాజకీయ ఎన్నికల పన్ను" విధించడం స్పష్టంగా కనపడుతుంది". అందుకే ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ.. దాని వారసత్వంపు స్కామ్‌లను బట్టి "స్కామ్‌గ్రెస్" అని పేరు పెట్టారు. ఎంత డబ్బు ముట్టజెప్పినా తెలంగాణ ప్రజలను మోసం చేయలేరు" అంటూ.. " మంత్రి కెటీఆర్ ట్వీట్ చేశారు. 

దీనికి బదులుగా.. మంత్రి కెటీఆర్ ట్వీట్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ చేసారు. "కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నడు. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది..? పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ కల్వకుంట్ల SCAMILY గురించి చెప్పు.. దళిత బంధులో  30 శాతం కమీషన్లు దండుకుంటున్నమని.. స్వయంగా మీ అయ్యనే ఒప్పుకున్న సంగతి గురించి చెప్పు.. లిక్కర్ స్కామ్ లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసిందని.. దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు..

Also Read: Cash Insurance News: బ్యాంకు లాకర్లలో క్యాష్‌కి ఇన్సూరెన్స్ ఉంటుందా ?

భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని.. కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు. తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నరో, ఎన్నిఎకరాలను మీ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో, ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నరో, ఎన్ని లక్షల చ. అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం. కాంగ్రెస్ ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు. అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేసారు. 

Also Read: Ap Heavy Rains: ఏపీలో రానున్న 48 గంటలు ఆ జిల్లాలకు అతి తీవ్ర వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News