Revanth Reddy: కేసీఆర్ కు దమ్ముంటే కొడంగల్ నుండి పోటీ చేయమనండి!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అసమ్మతి నాయకులు పార్టీలను వీడి మరో పార్టీలో చేరుతున్నారు. బీజేపీని వీడి సొంత గూటికి చేసిన రాజ్ గోపాల్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2023, 01:57 PM IST
Revanth Reddy: కేసీఆర్ కు దమ్ముంటే కొడంగల్ నుండి పోటీ చేయమనండి!

TPCC Revanth Reddy Comments: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలై రసవత్తరంగా  నడుస్తుంది. దసరా పండుగ సందర్భంగా కొంచెం గ్యాప్ తీసుకున్న రాజకీయ పార్టీలు తిరిగి ప్రచారాన్ని ప్రారంభించాయి. విమర్శలు.. ప్రతి విమర్శలు.. టికెట్ దక్కని నాయకులు పార్టీ జంపులతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. 

ఇక విషయానికి వస్తే ఇటీవలే బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరిన సంగతి తెలిసిందే! అయితే మునుగోడు ఎన్నికల సందర్భంగా.. రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరి పోటీ చేశారు కాకపొతే రాజ్ గోపాల్ రెడ్డి అక్కడ ఓడిపోయిన సంగతి తెలిసిందే! ఇపుడు మల్లి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి.. తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్ గోపాల్ రెడ్డి పార్టీ మార్పుతో చాలా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల సమయంలో రాజ్ గోపాల్ రెడ్డి పార్టీ మార్పుతో బీజేపీలో ఏం జరిగిందో అంతుపట్టని స్థితి నెలకొంది.. 

ఇక ఈ విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క రాజ్ గోపాల్ రెడ్డి మాత్రమే కాదు చాలా మంది రాజకీయ నాయకులు కేసీఆర్ అవినీతిని ఎండగడతామని గతంలో బీజేపీలోకి చేరారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగే అవినీతి సొమ్ములో బీజేపీ, బీఆరెస్ భాగస్వాములని తెలుసుకున్న నాయకులు తిరిగి కాంగ్రెస్ లో చేరటానికి ఆసక్తి కనబరుస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. 

Also Read: Moto Edge 40 Price: దీపావళి సేల్‌లో Moto Edge 40 రూ.24,830 వరకు తగ్గింపు..డిస్కౌంట్‌ వివరాలు ఇవే!  

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో రావాలనుకునే అన్ని పార్టీ నాయకులకు మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గతంలోనూ చెప్పాము.. ఇపుడు చెప్తున్నా.. కాంగ్రెస్ పార్టీలోకి అందరు ఆహ్వానితులే! కాంగ్రెస్ చేరే నాయకుల స్థాయిని బట్టి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. భయటానికి మాత్రమే బీఆరెస్ - బీజేపీ కొట్టుకుంటున్నట్టు నటిస్తున్నారు.. ఆ రెండు పార్టీలకు అవినీతిలో వాటా ఉంది.. బీఆరెస్ - బీజేపీ - ఎంఐఎం పార్టీలన్ని ఒక్కటే.. ఈ మూడు పార్ట్లు చెడ్డీ గ్యాంగ్. 

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆరెస్ వేరు వేరుగా పోటీ చేసినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు కలిసి పోటీ చేయనున్నాయి. బీజేపీ, బీఆరెస్ పార్టీల మధ్య సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయి. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 2/3 మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. పార్టీ ఆదేశిస్తే నేను కానీ భట్టి విక్రమార్క గానీ కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీకి సిద్ధం అని తెలిపారు. కేసీఆర్ చెప్పినట్టు పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసింది నిజమే అయితే.. కొడంగల్ లో కేసీఆర్ పోటీ చేయాలని సవాల్ విసిరా.. ఈ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరినీ ఓడించి తీరతామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Also Read:  7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. భారీగా జీతాలు పెంపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News