Revanth Reddy Satires on KCR, KTR: కేటీఆర్‌కి ఆ మాత్రం తెలియదా.. రేవంత్ రెడ్డి సెటైర్లు

Revanth Reddy Satires on KCR, KTR: విజయభేరీ సభ చూసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు చలి జ్వరం వచ్చింది. ప్రగతి భవన్ ను ఖాలీ చేయాల్సి వస్తుందేమో అన్న భయం కేసీఆర్ లో మొదలయింది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2023, 05:45 AM IST
Revanth Reddy Satires on KCR, KTR: కేటీఆర్‌కి ఆ మాత్రం తెలియదా.. రేవంత్ రెడ్డి సెటైర్లు

Revanth Reddy Satires on KCR, KTR: విజయభేరీ సభ చూసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు చలి జ్వరం వచ్చింది. ప్రగతి భవన్ ను ఖాలీ చేయాల్సి వస్తుందేమో అన్న భయం కేసీఆర్ లో మొదలయింది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత నుంచి గత 9 ఏళ్ళలో రాష్ట్రాన్ని దివాలా తీయించారు. కేసీఆర్ అచ్చి నెంబర్ కోసం 6 లక్షల కోట్ల అప్పు చేసారు. మా నాయకుడు కేసీఆర్, కేటీఆర్‌లా బ్లఫ్ మాస్టర్ కాదు.. రాహుల్ గాంధీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడుతాడు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ లేని చోట బీజేపీకి ఓటు వేయాలని అసదుద్దీన్ చెబుతున్నారు. కేసీఆర్ పై నమ్మకం లేకనే కవిత కోర్ట్ కు వెళ్లింది. కవిత అరెస్ట్ కోర్ట్ జోక్యం వల్ల ఆగిపోయింది.

కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. కాకపోతే టిక్కెట్ కేటాయింపు అనేది స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుందన్నారు. బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని 100శాతం ప్రయత్నిస్తున్నాం.. బీఆర్ఎస్ కంటే బీసీ లకు ఎక్కువ సీట్లు ఇస్తాం అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. అన్ని సామాజికవర్గాల వారు మా పార్టీ లో బలమైన వాదన వినిపించారు. అందుకే వారికి అన్యాయం జరగకుండా వారి తరుపున సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో నా వాదన ఉంటుందన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది బీసీలు పార్టీకి పీసీసీ చీఫ్‌గా చేసారు... ఒక్కరైనా బీఆర్ఎస్ పార్టీకి బీసీ అధ్యక్షుడు అయ్యాడా అని ప్రశ్నిస్తూ బీసీలపట్ల అధికార పార్టీ వైఖరిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో విడతల వారిగా అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. సీఈసీ మీటింగ్ పెట్టాలని ఏఐసీసీని కోరాం.. సీఈసీ మీటింగ్ తర్వాత ఫస్ట్ లీస్ట్ విడుదల అవుతుంది. 

కేటీఆర్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో వైట్ హౌస్ ముందు ధర్నా చేసాం.. నిరసన ఓక్కో సమయంలో ఓక్కోలా చేస్తాం. నిరసన లు చేసే హక్కు అందరికీ ఉంటుంది. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు తీసుకుంటున్న 30 % కమీషన్ కంట్రోల్ చేస్తే.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సమర్దవంతంగా అమలు చేయవచ్చు అని అన్నారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. మైనంపల్లి ఫ్యామిలీకి రెండు టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ చేసింది. వేముల వీరేశం చేరిక తొందరలోనే ఉంటుంది. ఎమ్మెల్సీల ఎంపిక చాలా కేటగిరీలలో జరుగుతుందని చెబుతూ చట్టంపై కేటీఆర్ కు అవగాహన ఉందా లేదా అని ప్రశ్నించారు. కేటగిరిని బట్టి ఎంపిక విధానం ఉంటుందని.. గవర్నర్ ఎంపికకు , ఎమ్మెల్సీల ఎంపికకు సంబంధం లేదు అని అన్నారు. త్వరలోనే  పార్టీ బస్సు యాత్ర ఉంటుంది.. మా సర్వే లలో బీఆర్ఎస్ పార్టీ 25 సీట్లు దాటదు , బీజేపీ, ఎంఐఎం లు సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతాయి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Trending News