Army Chief MM Naravane: న్యూ ఢిల్లీ: లడక్ సరిహద్దులో భారత్, చైనా సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే ( MM Naravane ) మంగళవారం లఢక్ చేరుకున్నారు. లఢక్‌లోని తూర్పు సరిహద్దులో భారత్, చైనా సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణ తరువాత పరిస్థితి గంటగంటకు మారుతోంది.
KCR To Meet Santosh Babu Family | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటనను అధికారులు ఖరారు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరం కేసీఆర్ పర్యటన వివరాలు వెల్లడించారు.
Colonel Santosh Babu | అమరవీరుడు, కల్నల్ సంతోష్ బాబు అస్థికలను కుటుంబ సభ్యులు నేడు నిమజ్జనం చేశారు. కుమారుడికి నిర్వహించాల్సిన సాంప్రదాయ కార్యక్రమాలను సంతోష్ బాబు తల్లిదండ్రులు పూర్తిచేస్తున్నారు.
చైనాతో ఘర్షణలో అమరుడైన సూర్యాపేట జిల్లా వాసి, అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ సాయాన్ని ప్రకటించింది. సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్ (CM KCR Announces RS 5 crore to Santosh Babu family)పేర్కొన్నారు.
భారత్ - చైనా సరిహద్దుల్లో చైనా బలగాలతో హోరాహోరి తలపడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు.. తెలుగు నేలపై పుట్టిన భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్రలో ప్రముఖులు, ప్రజానికం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్లు సంతోష్ బాబు నినాదాలతో సూర్యాపేట మార్మోగింది.భరత మాత ముద్దు బిడ్డ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనంతో సూర్యాపేట జన సంద్రమైంది.
భారత్ - చైనా సరిహద్దుల్లో చైనా బలగాలతో హోరాహోరి తలపడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు.. తెలుగు నేలపై పుట్టిన భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు, ప్రజానికం. సూర్యాపేట జోహార్లు సంతోష్ బాబు నినాదాలతో మార్మోగింది.భరత మాత ముద్దు బిడ్డ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనంతో సూర్యాపేట జన సంద్రమైంది. #ColSantoshBabu #ColonelSantoshBabu #SalutesToColSantoshBabu #SantoshBabu
భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు (Colonel Santosh Babu) సైనిక లాంఛనాలతో నిర్వహించారు. కేసారంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో సంతోష్ బాబు దహన సంస్కారాలు నిర్వహించారు.
Last Journey Of Santosh Babu | అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు సంతోష్ బాబు అమర్ రహే అంటూ దేశభక్తి చాటుతూ జయజయ ద్వానాల నడుమ పూలవర్షం కురిపిస్తున్నారు.
Colonel Santosh Babu`s mortal remains | సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం బుధవారం అర్థరాత్రి సూర్యాపేట చేరుకుంది. కుటుంబసభ్యులు, ప్రజల సందర్శనార్థం కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పార్థివదేహం సూర్యాపేటకు తీసుకొచ్చిన ఇండియన్ ఆర్మీ అధికారులు ( Indian army ) ఆ శవపేటికను తెరిచారు. భారత్ - చైనా సరిహద్దుల్లో ( India-china border) సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలు కోల్పోగా.. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఆర్మీ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు ఆ సమాచారాన్ని అందించిన సంగతి తెలిసిందే.
Colonel Santosh Babu`s mortal remains | హైదరాబాద్: లడాఖ్‌లోని భారత్ - చైనా సరిహద్దుల వద్ద గాల్వన్ వ్యాలీలో భారత సైనికులకు, చైనా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం హైదరాబాద్ చేరుకుంది.
Colonel Santosh Babu`s mortal remains | సూర్యాపేట : లడాఖ్‌లోని భారత్- చైనా సరిహద్దుల్లో గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో ( Indian Army vs Chinese troops ) వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని ఇండియన్ ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట్ విమానాశ్రయానికి తరలించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత సంతోష్ బాబు పార్థివ దేహం హకీంపేట లో ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎయిర్ బేస్‌కి కానీ లేదా బేగంపేట ఎయిర్ పోర్టుకు కానీ చేరుకునే అవకాశం ఉంది. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా సంతోష్ బాబు స్వస్థలమైన సూర్యాపేటకు పార్థివదేహాన్ని తరలించనున్నారు.
Indian Army | న్యూ ఢిల్లీ: చైనా బలగాలతో తూర్పు లడాఖ్‌లోని గల్వన్ లోయలో సోమవారం రాత్రి జరిగిన హోరాహోరీపై భారత ఆర్మీ స్పందించింది. చైనాతో ఘర్షణపై మంగళవారం సాయంత్రం ఇండియన్ ఆర్మీ స్పందిస్తూ.. "దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత సైన్యం ఎల్లవేళలా కృషి చేస్తుంది, ఎంతటి పోరాటమైనా చేస్తుంది" అని స్పష్టంచేసింది.
Colonel Santosh Babu | న్యూ ఢిల్లీ: చైనా సైన్యం మరోసారి రెచ్చిపోయింది. స్నేహహస్తం చాచినట్టు నటిస్తూనే భారత సైనికులను దొంగ దెబ్బ కొట్టింది. తూర్పు లద్దాక్‌లోని గల్వన్ లోయలో భారత బలగాలపై దాడికి తెగబడిన చైనా.. 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. చైనా బలగాలతో ( Chinese troops ) జరిగిన హోరాహోరి పోరాటంలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.