Colonel Santosh Babu`s mortal remains | సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం బుధవారం అర్థరాత్రి సూర్యాపేట చేరుకుంది. కుటుంబసభ్యులు, ప్రజల సందర్శనార్థం కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పార్థివదేహం సూర్యాపేటకు తీసుకొచ్చిన ఇండియన్ ఆర్మీ అధికారులు ( Indian army ) ఆ శవపేటికను తెరిచారు. భారత్ - చైనా సరిహద్దుల్లో ( India-china border) సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలు కోల్పోగా.. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఆర్మీ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు ఆ సమాచారాన్ని అందించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కల్నల్ సంతోష్ బాబును కడసారి చూసుకునేందుకు వేయి కళ్లతో వేచిచూస్తూ దుఖాన్ని దిగమింగుకుంటున్న ఆ కుటుంబం.. రెండు రోజుల తర్వాత ఆయన పార్థివదేహాన్ని చూసి తట్టుకోలేకపోయింది. 15 ఏళ్లపాటు ఇంటికి దూరంగా ఉంటూ దేశానికి సేవ చేసిన తమ కుమారుడు సంతోష్ బాబు శవపేటికలో విగతజీవిగా పడి ఉండటం చూసిన సంతోష్ బాబు తల్లి మంజుల, తండ్రి ఉపేందర్, భార్య సంతోషి ఒక్కసారిగా కుప్పకూలారు ( Colonel Santosh Babu`s family fainted). ఆ కుటుంబాన్ని ఓదార్చడం, వారి కన్నీటిని తుడవడం ఎవరితరం కాలేదు. ( Hakimpet: కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి గవర్నర్, మంత్రుల నివాళి )
ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇలా ప్రాణాలు కోల్పోవడం మంజుల, ఉపేందర్ దంపతులను ( Colonel Santosh Babu`s parents) తీవ్రంగా కలచివేస్తోంది. జీవితాంతం తనకు తోడుగా ఉంటాడనుకున్న తన భర్త ఇక తనకు శాశ్వతంగా లేరని తెలిసిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి ( Colonel Santosh Babu`s wife Santoshi) తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటుగా అక్కడే ఉన్న ఆర్మీ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం ఎదుట నివాళులు అర్పించారు. ( Colonel Santosh Babu: మిలిటరీ విమానంలో కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం తరలింపు )
ఇదిలావుండగా మరోవైపు కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు ( Colonel Santosh Babu`s last rites) కోసం సూర్యాపేటకు సమీపంలోని కేశారం గ్రామంలో ఆ కుటుంబానికి ఉన్న అర్ధ ఎకరం స్థలంలో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మిలిటరీ లాంఛనాల ( Military honours) మధ్య కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. ( అమరులైన 20 మంది జవాన్ల పేర్లు, వివరాలు.. )