Telangana Politics: పార్టీ మార్పుపై నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. తాము నియోజకవర్గాల సమస్యలపై కలిశామని.. పార్టీ ఉద్దేశం తమకు లేదన్నారు. తమకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Telangana Investments in Davos Summit: దావోస్‌లో తెలంగాణకు వస్తున్న భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాజీ ఎంపీ అజారుద్దీన్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలుతోపాటు పెట్టుబడుల ఆకర్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
Center for Fourth Industrial Revolution in Hyderabad: హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) ప్రారంభం కానుంది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు.
Fan Who Tripled On Six Guarantee: జగిత్యాల జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఓ మహిళ వినూత్నంగా ముగ్గు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అభిమానాన్ని చాటుకుంటూ ముగ్గుతో ఆరు గ్యారెంటీ పథకాలతో వివరించింది.
New Industrial Corridor in Miryalaguda: మిర్యాలగూడలో కొత్త పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు.
KTR Warning to CM Revanth Reddy: రాష్ట్రంలో జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా..? అని మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు.
Redistribution of Districts in Telangana: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో సంచలనం చేయబోతున్నారా..? రాష్ట్రంలో జిల్లాలను తగ్గించనున్నారా..? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసిన విధానంపై పునర్విచారణ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై రిటైర్డ్ జడ్జితో ఓ కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటామనడంతో మళ్లీ జిల్లాల పునర్విభజన ఉంటుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి.
Hyderabad Metro Rail New Plan: హైదరాబాద్ నగరంలో మెట్రో రైలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రధాన ప్రాంతాలను కలిపేవిధంగా.. ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయోగపడేలా కొత్త మెట్రో నిర్మాణం ఉండనుంది.
Mohammad Azharuddin Meets Revanth Reddy: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్కలను కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.
Praja Palana Application Form: ప్రజా పాలన దరఖాస్తులకు భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో కొందరు బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తగినన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
CM Revanth Reddy Review Meeting: తెలంగాణ బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు.
BR Ambedkar Law College Alumni Meet: రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకుని ప్రభుత్వ కొలువు సాధించాలని సూచించారు. చెడు అలవాట్లకు బానిస కావద్దన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.