Gaddar: సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన.. వాటి స్థానంలో ఇక నుంచి గద్దర్ అవార్డులు..

Telangana: సినిమా రంగంలో ఇచ్చే అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతీలో గద్దర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Last Updated : Jan 31, 2024, 08:36 PM IST
  • - మరో కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
    - నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు..
    - గుమ్మడి విఠల్ రావుకు మరణం తర్వాత అరుదైన గౌరవం..
Gaddar: సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన.. వాటి స్థానంలో ఇక నుంచి గద్దర్ అవార్డులు..

Nandi Awards Changed To Gaddar Awards: తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు జర్నీని అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణాలో ఉద్యోమంలో కీలక పాత్ర వహించిన వారికి సముచిత స్థానం కల్గించేలా రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

దీనిలో భాగంగా.. తెలంగాణ ఉద్యమంలో ప్రజా యుద్దనౌకగా పేరు పొంది.. ఎన్నో ఉద్యోమ గీతాలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వేత్తున ఎగిసేలా చేసి అమరుడైన గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) పేరు ఎప్పటికి గుర్తుండి పోయేలా చర్యలకు సీఎం శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఈరోజు గద్దర్ జయంతి సందర్భంగా.. రవీంద్ర భారతీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రభుత్వం తరఫున గద్దర్‌ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.  ప్రత్యేకంగా ట్యాలెంట్ కనబర్చిన వారికి నంది అవార్డులను ప్రకటిస్తారు.

అయితే..  ఇప్పటి నుంచి నంది అవార్డులకు బదులుగా.. గద్దరన్న పేరుతో కళాకారులకు పురస్కారాలు ప్రధానం చేస్తామని ప్రకటించారు. తొందరలోనే దీనికి సంబంధించిన జీవో జారీచేసి విధి, విధానాలు ప్రకటిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.ఇదిలా ఉండగా.. ఇప్పటికే తెల్లపూర్ లో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం కేటాయిస్తు ప్రభుత్వం ఇదివరకే జీవో ను జారీచేసిన విషయం తెలిసిందే. 

Read Also: Odisha: డాక్టర్ ను క్యాబిన్ లో చెప్పుతో కొట్టిన మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News