CM Revanth Reddy: ఇక నుంచి టీఎస్ కు బదులుగా టీజీ.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం..

Telangna: సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయానికి సిఫారసు చేస్తున్నట్లు సమాచారం. ఇక నుంచి తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ టీఎస్ కు బదులుగా టీజీ గా మారుస్తూ క్యాబినెట్ ఆమోదానికి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 4, 2024, 12:55 PM IST
  • - మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
    - టీఎస్ కు బదులుగా టీజీ..
    - మధ్యాహ్నం జరగనున్న క్యాబినెట్ సమావేశం..
CM Revanth Reddy: ఇక నుంచి టీఎస్ కు బదులుగా టీజీ.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం..

TG Instead Of TS Registration: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తనదైన మార్కు తో ముందుకు వెళ్తుంది. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి  ప్రభుత్వ పాలనలో అనేక శాఖలను ప్రక్షాళన చేశారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలు దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్గించడంతో ప్రజల్లో  మంచి రెస్పాన్స్ వస్తుంది. అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను కూడా నియమించారు.

Read More: Skin Care: ముఖంపై మొటిమలతో టెన్షన్ పడుతున్నారా..?.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..

ప్రజాభవన్ లో వారానికి రెండు సార్లు ప్రజల సమస్యలను వినతుల రూపంలో తీసుకుంటున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా స్పీడ్ ను పెంచారు.  ఈ క్రమంలోనే  సీఎం  రేవంత్ రెడ్డి మరోసంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రవేష పెట్టిన అనేక పథకాల మార్పును అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్యలు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం ను సూచించే విధంగా టీఎస్ ను రిజిస్ట్రేషన్ చేశారు. అయితే.. టీఎస్ స్థానంలో టీజీగా ఉండేలా మార్చేందుకు రేవంత్ సర్కార్ మార్పులకు సిద్దమైంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాహనాల నంబర్ ప్లేట్ లపై టీఎస్ అని ఇప్పటి దాక  ఉంది. అదే విధంగా అన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా ఇలాగే టీఎస్ వచ్చేలా ఉన్నాయి. అయితే.. ఇప్పుడు మాత్రం వీటికి టీజీగా మార్పు చెందేలా రేవంత్ చర్యలు తీసుకున్నారు. దీని కోసం క్యాబినెట్ లో ఆమోదం తెలిపి కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు సమాచారం.

అదే విధంగా మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కులగణన కు కూడా ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇదే సమావేశంలో.. మూసీ అభివృద్ది,ఐటి ఎగుమతులు,కొత్త ప్రభుత్వ హాస్పిటల్స్, రాష్ట్రంలో అందుతున్న వైద్యం పై క్యాబినెట్ లో చర్చించి పలు నిర్ణయాలు తీసుకొనున్నట్లు సమాచారం.  

ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలుకై బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రాధాన్యత పై చర్చ జరుగనుంది. రైతు భరోసా, కౌలు రైతు గుర్తింపు, రైతు కూలీ ఆర్ధిక సహాయం,మహా లక్ష్మి పథకం,500 రూ. గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్దిదారుల గుర్తింపు వీటి అమలుపై చర్చ జరుగనుంది. అయితే.. ఆరు గ్యారెంటిల అమలుకు ఏటా సుమారు 50వేల కోట్ల రూ. బడ్జెట్ అవసరమని అంచనా వేసినట్లు సమాచారం.

Read More: Poonam Pandey: మేము హర్ట్ అయ్యాం.. నటి పూనమ్ పాండేపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..

 నిరుద్యోగులు ఎప్పటి నుంచి వేచిచూస్తున్న.. గ్రూప్ 1 నోటిఫికేషన్ పై క్లారిటీ ఇవ్వాలని రేవంత్ సర్కారు భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వాహణ తేదీల పై కేబినెట్లో చర్చ జరుగనుంది.  అదే విధంగా.. సాగునీటి రంగంపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు మంత్రి మండలిలో చర్చించనున్నారు. కొడంగల్ - నారాయణ పేట ఎత్తిపోతల పథకానికి క్యాబినెట్  ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News