Himanshu Rao Surprise To Former CM KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన మనవడు సర్ప్రైజ్ ఇచ్చాడు. విదేశాల్లో చదువుకుంటున్న మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ రావు అకస్మాత్తుగా స్వదేశం వచ్చాడు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేసీఆర్‌కు తెలియకుండా ఆయన బస్సులోకి వెళ్లాడు. బస్సు యాత్రలో కేసీఆర్ బిజీగా ఉన్న సమయంలో హిమాన్షు వెళ్లి కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
KT Rama Rao Graduate MLC Bypoll Campaign: హామీలు ఇచ్చి వాటి నుంచి తప్పించుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తీన్మార్ మల్లన్నను సమాజానికి పట్టిన చీడ పురుగు అని అభివర్ణించారు.
KT Rama Rao Campaign Support To Rakesh Reddy In Graduate MLC Election: తెలంగాణలో మరో ఎన్నికపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
KCR Fire On Revanth Reddy Govt On Farmers Problems: ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రైతుల విషయమై ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.
BRS Party Next Target Warangal Nalgonda Khammam Graduate MLC: వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం తిరిగి కైవసం చేసుకోవడంపై గులాబీ దళం వ్యూహం రచిస్తోంది. పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగారు. పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నికపై సమీక్ష చేశారు.
We Will Majority Lok Sabha Seats KT Rama Rao Hopeful: అత్యధిక ఎంపీ స్థానాలు తామే గెలవబోతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మని ప్రజలు కారుకే ఓట్లు గుద్దారని తెలిపారు.
You Know Mahesh Babu Jr NTR Chiranjeevi Allu Arjun Ram Charan Polling Center: ఈసారి హైదరాబాద్ ప్రజలు ఓటింగ్‌కు కదులుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ఎక్కడ ఓటు వేస్తారో.. అసలు వారైనా ఓటు వేయడానికి వస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
Martyr Srikantha Chary: తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారీ తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల వేళ ఈ ఘటనతో బీఆర్ఎస్ కు షాక్ గా మారిందని చెప్పుకోవచ్చు.
KT Rama Rao Says KCR Will Again Chief Minister: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపిస్తే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మోదీ, రాహుల్‌తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు.
KCR Bus Yatra Theft Gold Chain And Cash: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యటనలో జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండడంతో జేబుదొంగలు చేతివాటం చూయిస్తున్నారు. కేసీఆర్ పఠాన్‌చెరు పర్యటనలో బంగారు గొలుసు, నగదు మాయమైంది. పోలీసులు సక్రమంగా బందోబస్తు నిర్వహించడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Rythu Bandhu: రైతు బంధు నిధులనే రైతు భరోసా పేరుతో విడుదల చేయడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెట్టుబడి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు విడుదల చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం పంట కోతల సమయంలో ఇవ్వడంపై రైతులు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KT Rama Rao Meets Manne Krishank In Chanchalguda Prison: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యుత్, నీటి కొరత కారణంగా సెలవులు ఇస్తున్నామనే అంశంపై జరిగిన వివాదంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్టయ్యారు. వారం రోజులుగా చంచల్‌గూడ జైలులో ఉన్న క్రిశాంక్‌ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. ధైర్యంగా ఉండాలని.. నీ వెంట పార్టీ ఉందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జైలుకు సిద్ధమా? అని రేవంత్‌ను నిలదీశారు.
Revanth Reddy On KCR Trop: అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీల అమలులో విఫలమై తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకుంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేకపోతున్నారు. బస్సుయాత్రలో కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నలు, డిమాండ్లకు రేవంత్ తలొగ్గాడు. ఈ క్రమంలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారం బిల్లులు చెల్లించారు. ఇలా కేసీఆర్ ట్రాప్‌లో రేవంత్ రెడ్డి పడడం కాంగ్రెస్ పార్టీలో కలవరం ఏర్పడింది. ఈ ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుందని అంచనా.
KCR Public Meeting In Siddipet: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేటలో గర్జించనున్నారు. అధికారం కోల్పోయిన అనంతరం బస్సుయాత్రతో విస్తృత పర్యటన చేస్తున్న కేసీఆర్ ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన సిద్దిపేటలో పర్యటించనున్నారు. బస్సు యాత్రగా వచ్చి అనంతరం ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సంచలన ప్రసంగం చేయనున్నారు. ఈ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డితో పరిశీలించారు.
KCR Touches His Intermediate Teacher Foot In Election Campaign: ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు పాఠాలు బోధించిన గురువును చూసి ఒకింత ఉద్వేగానికి లోనయి పాదాభివందనం చేశారు.
JP Nadda on Revanth Reddy: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ప్రచారాన్ని స్పీడ్ పెంచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నడ్డా భువనగిరి లోక్‌సభ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. చౌటుప్పల్‌లో సోమవారంత జరిగిన ప్రచార సభలో నడ్డా కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు బీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శలు చేశారు.
K Kavitha Bail Petition Rejected By Delhi Rouse Avenue Court: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు భారీ షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్లను బెయిల్‌కు నిరాకరించడంతోపాటు న్యాయస్థానం తిరస్కరించడం గమనార్హం.
ఏ ఎన్నికయినా హైదరాబాద్ ప్రజలు ఓటింగ్‌పై పెద్దగా శ్రద్ధ చూపరు. ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడంతో ఎన్నిక ఎన్నికకు పోలింగ్ శాతం తగ్గుతోంది. ఇది గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ హైదరాబాద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. వీకెండ్ ఉంది కదా అని టూర్లకు పోతా అంటే మీ ఇష్టం.. మీరే నష్టపోతారని కేటీఆర్ హెచ్చరించారు. ప్రతిఒక్కరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.