Telangana Dashabdi Utsavalu: బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. షెడ్యూల్‌ ఇదే!

Telangana Dashabdi Utsavalu Closing Ceremony For 3 Days Behalf Of BRS Party: ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను మాజీ సీఎం హోదాలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్వహించనున్నారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉత్సవాలకు సంబంధించి ముగింపు కార్యక్రమాలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 27, 2024, 09:32 PM IST
Telangana Dashabdi Utsavalu: బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. షెడ్యూల్‌ ఇదే!

Telangana Dashabdi Utsavalu: అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు అంబరాన్నంటే స్థాయిలో నిర్వహించారు. ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాలని పక్కా ప్రణాళికతో వెళ్లారు. అయితే అనూహ్యంగా అధికారం కోల్పోయారు. ప్రస్తుతం ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా దశాబ్ది ఉత్సవాలను కొనసాగిస్తామని ప్రకటించింది. తాము ప్రారంభించిన ఉత్సవాలను ముగింపు కూడా పలుకుతామని బీఆర్‌ఎస్‌ పార్టీ తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు.

Also Read: KT Rama Rao: రేవంత్‌ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల కుంభకోణం.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

 

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలకు సంబంధించి ముగింపు వేడుకలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ముగింపు ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు.  జూన్ 1, జూన్ 2, జూన్ 3వ తేదీల్లో మూడు రోజులపాటు పార్టీ అధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగాలని ఈ మేరకు పార్టీ నాయకత్వానికి కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాల షెడ్యూల్‌ విడుదల చేసింది.

Also Read: Revanth NBK: కొన్నేండ్ల తర్వాత కలుసుకున్న రేవంత్‌, బాలకృష్ణ.. కీలకాంశాలపై చర్చ

తెలంగాణను సాధించి.. స్వరాష్ట్రంలో తొట్ట తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలం పాటు ప్రగతిని సాధించినట్లు కేసీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పదేళ్లు దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ చారిత్రక సందర్భంలో జరుగుతున్న దశాబ్ది ముగింపు వేడుల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ముగింపు వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు.

దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు ఇవే..

జూన్ 1 

  • ముగింపు ఉత్సవాల్లో తొలి రోజు రాష్ట్రం కోసం తమ ప్రాణాలు త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకోనున్నారు.
  • జూన్ 1 తేదీ శనివారం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ.  సాయంత్రం 7 గంటలకు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ వద్ద గల అమర జ్యోతి వరకు ప్రదర్శన చేపట్టనున్నారు.
  • అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించనున్నారు.

జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

  • తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు సందర్భంగా.. దీంతోపాటు గతేడాది ప్రారంభించిన దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ నిర్వహించనున్నారు.
  • హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది.
  • ఆదివారం రోజు హైదరాబాద్‌లోని దవాఖానాలు, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, మిఠాయిలు పంపిణీ కార్యక్రమాలు చేపడతారు.
    జూన్ 3
  • ముగింపు ఉత్సవాల్లో మూడో రోజు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు నిర్వహిస్తారు.
  • ఈ సందర్భంగా ఆరోజు పార్టీ జెండాతోపాటు జాతీయ జెండాను ఎగరవేస్తారు. 
  • అనంతరం జిల్లాల్లోని దవాఖానాలు, అనాథ శరణాలయాల్లో మిఠాయిలు, పండ్లు పంపిణీ చేస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter 

Trending News