Telangana martyrs srikanth chary mother shankaramma joined in congress party: ఎన్నికలు సమీపిస్తున్న కొలది తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ను ఆపార్టీ నేతలు వదిలేసి,కాంగ్రెస్ లోకి చేరిపోతున్నారు. వీరిలో ముఖ్యంగా కడియం శ్రీహారి, కే కేశవరావులు పార్టీ మారడం తీవ్ర రచ్చకు దారితీసింది. వీరంతా కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఉన్నత పదవులు,హోదాను పొంది, తీరా పార్టీ ఓడిపోయాక కష్టకాలంలో పార్టీని వదిలేశారంటూ అనేక మంది నేతలు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హమీలిచ్చి అధికారంలోకి వచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరిన నేతలను, ఫూచర్ లో తిరిగి బీఆర్ఎస్ లోకి ఎట్టిపరిస్థితుల్లో రానిచ్చేది లేదంటూ కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇప్పటికే తెల్చిచేప్పేశారు. మరోవైపు బీఆర్ఎస్ ల నుంచి మాత్రం వరుసల జోరు ఆగడం లేదు.
Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...
తాజాగా, తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు తెలంగాణను దోచుకున్నారంటూ ఎద్దేవాచేశారు. ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని, అన్నిరంగాలలో తెలంగాణ వెనుకబడిదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను, మాజీ సీఎం కేసీఆర్ మోసం చేశాడని అన్నారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాటతప్పాడని అన్నారు.
ఇదిలా ఉండగా.. శంకరమ్మ మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణంతీర్చుకునే సమయం వచ్చిందని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ కోసం అమరులైన బిడ్డల ఆత్మబలిదానాలు చూసి చలించిపోయారన్నారు. అందుకు తెలంగాణాను ప్రకటించారన్నారు. అంతేకాకుండా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. తొందరలో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ కు మెజార్టీ స్థానాలు ఇచ్చి దేశంలో బీజేపీని గద్దెదించేలా చేయాలన్నారు.
కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే, తెలంగాణ వేగంగా డెవలప్ అవుతుందని శంకరమ్మ అన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరింది. ఎన్నికల ప్రచారం ముగియడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆయా పార్టీల నేతలు అనేక ప్రాంతాలలో సుడిగాలీ పర్యటనలు చేస్తున్నారు. అంతేకాకుండా.. ఎవరికి వారు తమదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తు ఎన్నికలలో గెలిపించాలని కూడా ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Martyr Srikantha Chary: బీఆర్ఎస్ కు వరుస షాకులు.. కాంగ్రెస్ కండువ కప్పుకున్న శ్రీకాంతా చారీ తల్లి..
ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్..
కాంగ్రెస్ లో చేరిన శంకరమ్మ