CM KCR: ఇక కేంద్రంతో యుద్దమే..సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..!

CM KCR:  కేంద్ర ప్రభుత్వంపై మరోమారు సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వడం లేదన్నారు

Written by - Alla Swamy | Last Updated : Aug 6, 2022, 05:34 PM IST
CM KCR: ఇక కేంద్రంతో యుద్దమే..సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..!
Live Blog

CM KCR: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఇక యుద్ధం తప్పదన్నారు సీఎం కేసీఆర్. రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామన్నారు. నీతి ఆయోగ్ సిఫార్సును కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించింది. ఐనా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

 

6 August, 2022

  • 17:27 PM

    5G స్పెక్ట్రమ్ వేలం ఓ స్కామ్
    5 లక్షల కోట్లు అంచనా వేస్తే..లక్షన్నర కోట్లే ఎలా వస్తాయి
    పాలు, చేనేత, స్మశానాలపై జీఎస్టీ తొలగించాలి
    ఉపాధి హామీ పథకాన్ని తొలగించాలని చూస్తున్నారు
    రేపు మరోసారి మీడియా ముందుకు వస్తా: కేసీఆర్

  • 17:13 PM

    ఉచితాలు తప్పు అయితే ఎన్‌పీఏలకు ఎందుకు ఇస్తున్నారు?
    ఎన్‌పీఏల పేరుతో బిగ్ స్కామ్ నడుస్తోంది
    స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 57 ఏళ్లకే పెన్షన్
    కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్
    డయాలసిస్ పేషెంట్లకు రూ.2016 పెన్షన్
    75 మంది ఖైదీలను విడుదల చేస్తాం
    అనాధ పిల్లలను రాష్ట్ర పిల్లలుగా ప్రకటిస్తాం

     

  • 17:00 PM

    ఏక్‌నాథ్‌ షిండేలు, బెంగాల్, తమిళనాడులో వస్తారని ప్రచారం చేస్తారా..?
    దేశంలో ఏకస్వామ్య పార్టీ పాలన ఉంటుందని నడ్డా అంటారా..?
    ఇదేనా టీమిండియా స్ఫూర్తి..ఇదేనా కో-ఆపరేటివ్ ఫెడరలిజం
    రాజ్యాంగబద్ధ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకున్నారు
    ఉచితాలు బంద్ చేయాలని కొత్త దుకాణం మొదలు పెట్టారు

  • 16:45 PM

    8 ఏళ్లలో నీతి ఆయోగ్ సాధించింది ఏమీ లేదు: కేసీఆర్
    ప్లానింగ్ కమిషన్‌ను తీసేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చి ఏం సాధించారు
    ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రాధాన్యత 
    ట్యాక్సులు, సెస్‌ల పేరుతో రాష్ట్రాల నిధులను కొల్లగొడుతున్నారు
    మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పూర్తైనా కేంద్రం నిధులు ఇవ్వలేదు

  • 16:24 PM

    దేశం సంక్లిష్ట పరిస్థితిలో ఉంది: సీఎం కేసీఆర్
    ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోంది
    ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది
    దీంతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు బ్రేక్ పడుతోంది
    కేంద్రానివి అన్నీ ఏకపక్ష నిర్ణయాలే: సీఎం కేసీఆర్

     

  • 16:17 PM

    ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
    రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం
    నీతి ఆయోగ్ సిఫార్సును కేంద్రం పట్టించుకోవడం లేదు
    మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించింది
    కానీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు

     

  • 15:14 PM

    కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం

    కేసీఆర్ ఏం మాట్లాడుతారన్న దానిపై ఉత్కంఠ

    తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడే అవకాశం

    బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు కేసీఆర్ కౌంటర్ ఇచ్చే ఛాన్స్

    ముందస్తు ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇవ్వనున్న కేసీఆర్

    జాతీయ స్థాయిలో భవిష్యత్ కార్యాచరణను వివరించనున్న కేసీఆర్

     

  • 14:06 PM

    ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పై తెలంగాణలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ముందస్తు ఎన్నికలపై ఆయన కీలక ప్రకటన చేయబోతున్నారా అన్న అనుమానాలు కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ఎన్నికలు ఉండవు.. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కొన్ని రోజుల క్రితం మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కీలక ప్రకటన చేయడానికే ప్రెస్ మీట్ పెట్టారనే వార్తలు వస్తున్నాయి.

  • 13:23 PM

    మునుగోడు ఉప ఎన్నికపైనా కేసీఆర్ స్పందిస్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంలోనూ కేసీఆర్ మాట్లాడుతారని అంటున్నారు. పీకే టీమ్ తో  తెలంగాణ వ్యాప్తంగా సర్వేలు చేయించారు సీఎం కేసీఆర్. ప్రశాంత్ కిషోర్ తో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. పీకే టీమ్ సర్వేలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత భారీగా ఉందనే లీకులు వచ్చాయి. సమయం పెరిగే కొద్ది ఇది మరింత పెరుగుతుందని పీకే టీమ్ చెప్పినట్లు తెలుస్తోంది. ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ కు పీకే నివేదిక ఇచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఏదైనా ప్రకటన చేస్తారా అన్న చర్చ సాగుతోంది.

  • 13:15 PM

    తెలంగాణ రాజకీయాలపై సీఎం కేసీఆర్ స్పందిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో కొన్ని రోజులుగా ఈడీ దాడులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఈడీ దాడులు జరుగుతున్నాయన్న వార్తలపైనా కేసీఆర్ రియాక్ట్ అవుతారని భావిస్తున్నారు. తనపై కమలం నేతలు చేస్తున్న ఆరోపణలకు కేసీఆర్ కౌంటర్ ఇస్తారని అంటున్నారు.

  • 13:11 PM

    మీడియా సమావేశంలో కేసీఆర్ ఏం చెబుతారు అన్నదానిపై తెలంగాణ వ్యాప్తంగా సస్పెన్ష్ నెలకొంది. దేశంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆయన స్పందిస్తారని అంటున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు ఎంతవరకు వచ్చింది.. కొత్త పార్టీ పెడతారా లేక కలిసి వచ్చే పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తారా అన్న అంశాలపై క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలపైనా కేసీఆర్ మాట్లాడుతారని తెలుస్తోంది.

Trending News