Dasoju Sravan : రెండు వేల నోట్ల రద్దు అనేది పెద్ద స్కాంలా కనిపిస్తోందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. దీనిపై విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీని వల్ల దేశానికి ఎలా ప్రయోజనం అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశాడు.
Telangana Politics: వలస నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదా.. అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు పోటిపడి మరీ కమలం గూటికి చేరారు. తమ పార్టీలోకి చేరికలు భారీగా ఉండబోతున్నాయని కొంత కాలంగా బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాని ఆ పార్టీలోకి వలసలు లేకపోగా.. జంపింగులు ఎక్కువయ్యాయి. గత వారం రోజులుగా రోజు ఎవరో ఒక కీలక నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కారు ఎక్కేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు
Telangana Politics: కోటి ఆశలతో బీజేపీలో చేరినా అక్కడ ఇమడలేక బయటకి వచ్చిన నేతల లిస్ట్ భారీగానే ఉంది. నాగం జనార్ధన్ రెడ్డి మొదలుకొని ఆనంద భాస్కర్ వరకు ఆ లిస్టు పెద్దగానే ఉంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
Jitender Reddy reaction on joining TRS party : మాజీ ఎంపీ, బీజేపి నేత జితేందర్ రెడ్డి బీజేపికి గుడ్ బై చెప్పి తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Pawan Kalyan on Dasoju Sravan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌కు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా బీజేపీని తిట్టిన ఆయనను పొగడ్తలతో ముంచారు.
మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్ది అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్ నుంచి కమలం పార్టీలోకి చేరిన నేతలకు మళ్లీ గాలం వేస్తూ.. తిరిగి పార్టీలోకి రప్పిస్తున్నారు. ఇటీవలె బీజేపీలోకి చేరిన దాసోజు శ్రవణ్.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన అధికార టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు.
TRS OPERATION AKARSH: గతంలో ఉద్యమంలో పని చేసి.. టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నాల్లో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్శ్ కు తెరలేపారు. పాత నేతలను రప్పించేందుకు గులాబీ బాసే స్వయంగా రంగంలోకి దిగారని చెబుతున్నారు.
Dasoju Sravan: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కుమార్ కమలం పార్టీలో చేరారు.తెలంగాణ బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు దాసోజు శ్రవణ్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, బిజెపి ఎంపీ లక్ష్మణ్, సీనియర్ నేత మురళీధర్ రావు హాజరయ్యారు.
Dasoju Sravan: ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని పబ్లికి లిమిటెడ్ కంపెనీలా మార్చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ కు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరడం ఖాయమైంది.
Dasoju Sravan: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. మరో కీలక నేత పార్టీని వీడారు. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.