BJP: తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం..జేపీ నడ్డా, అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!

BJP: దేశంలో కమలనాథులు స్పీడ్ పెంచారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నారు. పాట్నాలో జరిగిన పార్టీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Aug 1, 2022, 12:30 PM IST
  • స్పీడ్ పెంచిన కమలనాథులు
  • బీహార్‌లో జాతీయ సమావేశాలు
  • తెలంగాణ శాఖపై ప్రశంసలు
BJP: తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం..జేపీ నడ్డా, అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!

BJP: బీహార్ పాట్నాలో వివిధ మోర్చాల జాతీయ సమావేశాలు ముగిశాయి. నాలుగురోజులపాటు జరిగిన సమావేశాల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా తెలంగాణ బీజేపీ శాఖ చేస్తున్న పోరాటాలు ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాలను పార్టీ పెద్దలు పదే పదే ప్రస్తావించారు. 

తెలంగాణలో చేస్తున్న పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని మోర్చాల నేతలు పనిచేయాలని ఈసందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల పరిధిలో ఇటీవల జాతీయ నేతలు రెండురోజులపాటు పర్యటించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా గుర్తు చేశారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్‌పై ప్రసంసలు కురిపించారు. జాతీయ సమావేశాల్లో తెలంగాణ పార్టీ గురించి ప్రస్తావించడంతో అక్కడే ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలు చపట్లతో హర్షం వ్యక్తం చేశారు. బీహార్‌లో బీజేపీ నేతలు అద్భుతంగా పనిచేశారని..అందుకే రెండోసారి పవర్‌లోకి వచ్చామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా. 

త్వరలో తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇకపై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వచ్చే వారం నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభంకానుంది. ఈసందర్బంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి..ఇందులో జాతీయ నేతలు పాల్గొనేలా చూస్తామని కమలనాథులు చెబుతున్నారు.

Also read:Basar IIIT: మరోసారి రణరంగంలా బాసర ట్రిపుల్ ఐటీ.. తల్లిదండ్రుల ఎంట్రీతో హై టెన్షన్

Also read:ED TARGET KCR: ఈడీ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ గా దినేష్.. కేసీఆర్ కు ఉచ్చు బిగిసినట్టేనా? తెలంగాణలో ఏం జరగబోతోంది..    

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News