Marri Shashidhar Reddy Got Suspended: కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మాజీ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రణశిక్షణ చర్యలు తీసుకుంది. తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి నిన్న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ స్థాయిని, ప్రతిష్టను దిగజార్చేలా, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయనను 6 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ క్రమ శిక్షణ కమిటి ఓ అధికారిక లేఖను విడుదల చేసింది. టీపీసీసీ క్రమ శిక్షణ కమిటి నేత జి చిన్నా రెడ్డి పేరిట ఈ లేఖ విడుదలైంది.
అంతకంటే ముందుగా మీడియాతో మాట్లాడిన మర్రి శశిధర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేసే స్టేజీలో లేదని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదన్న మర్రి శశిధర్ రెడ్డి.. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని స్పష్టంచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై మూన్నెళ్ల క్రితమే పార్టీ హై కమాండ్‌కి వివరించానని అన్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైనా మర్రి శశిధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు అందుబాటులో ఉండటం లేదని.. చెంచాగాళ్లను పెట్టుకుని పార్టీని నడిపిస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ పోస్ట్ ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కి చెప్పిన వాళ్లలో తాను ఒకరినని గుర్తుచేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో 15 మందిని గెలిపించుకుని వారితో సొంత కుంపటి పెట్టుకునే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలోనూ రూ. 10 కోట్లు ఖర్చుపెడతానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఒక్కపైసా కూడా ఖర్చుచేయలేదని మండిపడ్డారు. ఉప ఎన్నికల ప్రచారంలో బాధ్యతలు తీసుకున్న ఇంచార్జులకే ఖర్చును కూడా భరించాలని చెప్పారని.. లేదంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని బెదిరించారని అన్నారు. టికెట్లు, పదవులు అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలతోనే డబ్బు ఖర్చు పెట్టించారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గురించి, తమ నాయకుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) గురించి మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయన్ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
Also Read : Marri Shashidhar Reddy: రేవంత్ రెడ్డి సొంతదుకాణం పెట్టబోతున్నాడు: మర్రి శశిధర్ రెడ్డి
Also Read : Bandi Sanjay: మా ఎండింగ్ భయంకరంగా ఉంటుంది.. కేసీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook