దేశం మెచ్చిన మాజీ ప్రధాని, మృధు స్వభావి అటల్ బిహారి వాజ్ పేయి ఇక లేరు. 93 ఏళ్ల వయస్సులో తీవ్ర అనారోగ్యానికి గురైన వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం అందరికీ ఇక సెలవు అంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మన మధ్య లేకపోయినా... ఆయన చూపిన సన్మార్గం, ఆయన ఆచరించిన ఆదర్శపు జీవితం అందరికీ స్పూర్తిగా నిలుస్తుంది. రాజకీయాల్లోకి రావాలనుకునే భవిష్యత్ తరాలకు బాటలు వేస్తుంది. ఇంతకీ అటల్ బిహారి వాజ్‌పేయిని అందరివాడిగా తీర్చిదిద్దిన ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది ? ఎలా దేశానికి నాయకుడిని చేసిందో తెలుసుకోవాలంటే, వాజ్‌పేయి రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకోవాల్సిందే.
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న బీజేపీ దిగ్గజ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కోసం యావత్ దేశం.. ఆయన త్వరలో కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది. భారత దేశ ప్రధాని సహా పలువురు రాజకీయ నాయకులు ఆయన్ను ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు.
మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారి వాజ్‌పేయి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు ఆయనకు చికిత్స అందిస్తున్న ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు తాజాగా ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. మాజీ ప్రధాని క్షేమంగా కోలుకోవాలని ప్రార్థిస్తూ దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాజ్‌పేయితో సాన్నిహిత్యం ఉన్న నేతలు ఆయన్ను నేరుగా పరామర్శించేందుకు ఆస్పత్రికి క్యూ కట్టగా ఇంకొందరు నేతలు వాజ్‌పేయి కోలుకోవాలనే ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.